టీడీపీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ సౌత్ ఇండియా బీహార్ గా మారుతోందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు.
ప్రజల పక్షాన పోరాడుతున్న టీడీపీపై అక్రమ కేసులు పెడుతున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి అన్ని అంశాలను వివరించామని చెప్పారు.టీడీపీ సీనియర్ నేతలపై 260 కేసులు పెట్టారన్న లోకేశ్ టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారని మండిపడ్డారు.
ఆధారాలు లేకపోయినా రోజుల తరబడి జైళ్లల్లోనే ఉంచుతున్నారన్నారు.అలాగే చంద్రబాబు బెయిల్ పై స్పష్టత వచ్చాక భవిష్యత్ కార్యాచరణ ఫిక్స్ చేస్తామని తెలిపారు.
రేపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో సీఈవోను కలుస్తామని వెల్లడించారు.ఓటర్ల జాబితాలో అవకతవకలపై వివరిస్తామని తెలిపారు.
మరోవైపు పొత్తులో భాగంగా జనసేనతో సంప్రదింపులు జరిపామన్న లోకేశ్ త్వరలో మ్యానిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.