Nagababu Niharika: కూతురికి వడ్డీకి డబ్బులు ఇస్తున్న నాగబాబు…మరీ ఇంత కమర్షియలా?

తెలుగు సినీ ఇండ్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Naga Babu Give Money To Niharika With Intrest-TeluguStop.com

ఈ విధంగా చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన బాటలోనే తన తమ్ముళ్లు అలాగే తన వారసులంతా కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.చిరంజీవి తమ్ముడిగా మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) అందరికీ ఎంతో సుపరిచితమే ఈయన పలు సినిమాలలో నటుడిగా నటించారు.

అలాగే నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.

ఇలా ఒక వైపు నిర్మాతగాను అలాగే బుల్లితెర నటుడిగా కూడా నాగబాబు నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ప్రస్తుతం ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు జనసేన పార్టీలో(Janasena) పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన కుమారుడు వరుణ్ తేజ్( Varun Tej ) ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు అలాగే నిహారిక కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

నిహారిక( Niharika ) యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు అయితే ఈమె నిర్మాతగా మారిపోయారు.ఇలా నిర్మాతగా ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఉన్నారు.మెగా బ్రదర్ నాగబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కుమార్తె కుమారుడు గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక నిహారిక ప్రొడక్షన్ హౌస్( Production House ) ప్రారంభించిన తర్వాత ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు లేదా వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు తనకు కొంత డబ్బు అవసరం అవుతుందని నన్ను అడుగుతూ ఉంటారని నాగబాబు తెలిపారు.

ఇలా నిహారిక డబ్బు అడగగానే తాను ఇస్తాను అని చెప్పగా వెంటనే యాంకర్ ఊరికే ఇస్తారా ఇంట్రెస్ట్ కి ఇస్తారా అని అడగడంతో తాను వడ్డీకే( Interest ) తన కుమార్తెకు డబ్బులు ఇస్తానని ఈ సందర్భంగా నాగబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే తన కుమార్తె తిరిగి డాడీ నేను మీకు ఇంత ఇవ్వాలి కదా అంటూ పదే పదే నాకు గుర్తు చేస్తూ ఉంటుంది.కొన్నిసార్లు నేను ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవడం కూడా మానేశాను అంటూ నాగబాబు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక వరుణ్ (Varun) తనని ఎప్పుడు కూడా డబ్బులు అడగరు.ఇక తానే డాడీ నీకు ఏమైనా అవసరమైతే డబ్బు తీసుకో అని చెబుతూ ఉంటాడు కానీ నేనైతే వారి డబ్బు వాడుకోను నాకు సంపాదించుకొనే స్తోమత ఉంది నేనే వాళ్లకు తీస్తూ ఉంటాను కానీ వారి డబ్బును నేను తీసుకోను అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=1427771647958546
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube