నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Balakrishna) కెరీర్ లో 109వ ( NBK109 ) సినిమాను ఈ మధ్యనే అఫిషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.యంగ్ డైరెక్టర్ బాబీ ( Director Bobby ) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య జాయిన్ అయ్యేందుకు సిద్ధం అయ్యాడు.
ఈ ప్రాజెక్ట్ లాంచ్ తోనే భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా ఇప్పుడు షూట్ గురించి లేటెస్ట్ గా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ( Ramoji Film City )లో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.బాలయ్య అంటేనే యాక్షన్ కాబట్టి ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్ తోనే స్టార్ట్ కానుంది అని టాక్.ఈ సెట్ లో హీరో, విలన్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ షూట్ స్టార్ట్ చేస్తారట.
ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.చూడాలి ఈ సినిమాలో బాబీ ఇంకెన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో.
అయితే ఇది బాలయ్య టైప్ యాక్షన్ డ్రామా కాదని ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగిపోయే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తుంది.అయితే ఇందులో ఫ్లాష్ బ్యాక్ మాత్రం పాలిటిక్స్ నేపథ్యంలో ఉంటుందట.

ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య వ్యవహరించ బోతున్నారు.థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.ఇక ఇటీవలే బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది.







