కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) దసరా బరిలో తన కొత్త సినిమాతో వచ్చి ఆకట్టు కున్నాడు.వారిసు తర్వాత మళ్ళీ విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ”లియో” ( LEO ) .
సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా లియో తెరకెక్కింది.ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా అక్టోబర్ 19న రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.మిక్స్డ్ టాక్ వచ్చిన ఆ తర్వాత మంచి వసూళ్లను రాబడుతూఅదరగొట్టింది.
ఇప్పటికే 500 కోట్ల మార్క్ దాటేసింది.అలాగే తెలుగులో మొదటిసారి విజయ్ సినిమాకు ఓ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 20 కోట్ల మార్క్ షేర్ అందుకుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యిందని టాక్.ఓటిటిలో మరింత ఎక్కువ నిడివితో ఏకంగా 3 గంటల 6 నిముషాల వ్యవధితో కొత్త వర్షన్ రిలీజ్ అవుతున్నట్టు టాక్.ఇక ఈ సినిమా నవంబర్ 16 నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.చూడాలి ఇందులో నిజమెంతో ఉందో.

కాగా ‘లియో’ ( LEO )సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )నటించింది.సంజయ్ సత్, గౌతమ్ మీనన్, అర్జున్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్( Lalit Kumar ) భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.







