మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) తాజాగా నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా ఈ జంట నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే తాజాగా వీరి పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గతంలో తన కుమార్తె నిహారిక పెళ్లిని ఎంతో ఘనంగా చేసినటువంటి నాగబాబు ( Nagababu ) పెళ్లికి సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఇప్పటికే ఈ పెళ్లి వీడియో చాలా ట్రెండ్ అవుతూనే ఉంది.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్లి వీడియో కూడా ఇలాగే అప్లోడ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు అయితే ఈసారి మాత్రం వరుణ్ పెళ్లి విషయంలో నాగబాబు ఈ పని చేయడం లేదని సమాచారం.ఎందుకంటే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోని నెట్ ఫ్లిక్స్ ( Net Flix ) లో ప్రచారం చేయబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నెట్ ఫ్లిక్స్ వారు నాగబాబుకు ఒక భారీ ఆఫర్ ఇచ్చారట తమ కుమారుడి పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయడానికి ఆయనకు ఎనిమిది కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని అందుకే ఈ పెళ్లి వీడియోని నాగబాబు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకోవడం లేదు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ విధంగా నాగబాబు నెట్ ఫ్లిక్స్ వారితో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలోనే ఈ పెళ్లికి సంబంధించి ఎలాంటి వీడియోలు బయటకు రాలేదు.కేవలం ఫోటోలు మాత్రమే బయటకు వస్తున్నాయి కానీ వీడియోలు మాత్రం బయటకు రాలేదు.అయితే గతంలో నెట్ ఫ్లిక్స్ వారు పలువురు సెలబ్రిటీల పెళ్లి వీడియోలను ఇలా భారీ ధరలకు కొనుగోలు చేశారు.ఇక నయనతార విగ్నేష్ పెళ్లి వీడియోని కూడా ఇలాగే కొనుగోలు చేసినప్పటికీ నిబంధనలను వీరిద్దరూ ఉల్లంగించిన నేపథ్యంలో పెళ్లి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది.
మరి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో గురించి కూడా వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.







