తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వాహనంలో మరోసారి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ మేరకు కామారెడ్డి చెక్ పోస్ట్ వద్ద అధికారులు సోదాలు చేశారు.
నిన్న వరంగల్ సమీపంలోని నర్సాపూర్ లోనూ హోంమంత్రి వాహనంలోనూ పోలీసులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి, మంత్రులనే తేడా లేకుండా ప్రజా ప్రతినిధుల వాహనాలలో సైతం సోదాలు చేస్తున్నారు.







