వన్డే వరల్డ్ కప్ లో భాగంగా కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.నేడు జరిగే మ్యాచ్ భారత జట్టుకు చాలా ప్రత్యేకం.
నవంబర్ 5 భారత జట్టు రన్ మిషన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) పుట్టినరోజు.CAB ఇప్పటికే కోహ్లీ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసేందుకు ఘనంగా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.
ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లలో వరుస విజయాలను సాధించి ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.కాకపోతే నేడు విరాట్ కోహ్లీ పుట్టినరోజు కావడంతో భారత జట్టు కచ్చితంగా గెలవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) కూడా విరాట్ కోహ్లీకి విజయాన్ని కానుకగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు.మరొకపక్క కోహ్లీ ఇప్పటికే ఈ టోర్నీలో రెండుసార్లు స్వల్ప పరుగుల తేడాతో సెంచరీలను మిస్ చేసుకున్నాడు.
నేడు దక్షిణాఫ్రికా( South Africa )పై విరాట్ కోహ్లీ సెంచరీ చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.

ఈ మ్యాచ్లో భారత్ గెలవడం కోసం కుల్దీప్ యాదవ్ స్థానంలో శార్థూల్ ఠాగూర్ ( Shardul Thakur )లేదా ప్రసిధ్ధ్ కృష్ణ లను తీసుకునే అవకాశం ఉంది.ఎందుకంటే.భారత పిచ్ పై, స్పిన్నర్లపై దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
దాదాపుగా దక్షిణాఫ్రికా బ్యాటర్లంతా ఈ టోర్నీ ఆరంభం నుంచి మంచి ఫామ్ నే కొనసాగిస్తున్నారు.వీళ్ళని పూర్తిస్థాయిలో కట్టడి చేస్తేనే భారత జట్టు ఖాతాలో వరుసగా ఎనిమిదవ విజయం ఖాతాలో పడుతుంది.
విరాట్ కోహ్లీ పుట్టిన రోజున మ్యాచ్ గెలిస్తే ఇక ఫ్యాన్స్ కు కలిగే సంతోషం మాటల్లో కూడా వర్ణించలేం.

నేడు మ్యాచ్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ బర్త్డే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కూడా విరాట్ కోహ్లీకి స్మారక చిహ్నం ఇవ్వాలని యోచిస్తోంది.నేడు మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరికి విరాట్ కోహ్లీ మాస్క్ ఇచ్చేలా మేనేజ్మెంట్ ప్లాన్ చేసినట్లు సమాచారం.







