వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్ర విజయవంతంగా సాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పలు జిల్లాలలో బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది.
ఏడో రోజు శ్రీ సత్య సాయి జిల్లాలో ధర్మవరంలో( Dharmavaram ) నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( MLA Kethireddy Venkatrami Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.సమాజంలో 80% ఉన్న అణగారిన వర్గాలకు మేలు చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే( CM Jagan ) అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్, మున్సిపల్, స్థానిక సంస్థల పదవులన్నీ బడుగు బలహీన వర్గాలకే ఇచ్చారు.సంక్షేమ పథకాలను( Welfare Schemes ) డోర్ డెలివరీ చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే.గత నాలుగున్నర ఏళ్లలో ధర్మవరం నియోజకవర్గంలో 2500 కోట్ల రూపాయల లబ్ధి పొందారని స్పష్టం చేశారు.ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా నిలవాలని సూచించారు.
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు( Chandrababu Naidu ) చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.







