ఓటీటీ ప్రభావం జనాల్లో ఏ రేంజ్ లో ఉందో రీసెంట్ గా విడుదలైన ‘పొలిమేర 2’ మూవీ( Polimera 2 ) కలెక్షన్స్ ని చూస్తే అర్థం అవుతుంది.ఈ చిత్రం మొదటి భాగం ‘మా ఊరి పొలిమేర’ థియేటర్స్ లో కాకుండా నేరుగా డిస్నీ + హాట్ స్టార్ లో( Disney Plus Hotstar ) విడుదల అయ్యింది.
ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అతి తక్కువ బడ్జెట్ తో ఒక గ్రామం లో జరిగే చేతబడి హత్యల నేపథ్యం లో తీసిన ఈ సినిమా మొత్తం ఊహించని మలుపులతో, ఉరకలేసే స్క్రీన్ ప్లే తో ఓరా అనిపించుకుంది.
ఈ సినిమా సెకండ్ పార్ట్ విడుదల కోసం ఆడియన్స్ చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు.ఓటీటీ లో విడుదల అవుతుంది అనుకుంటే, ఈ చిత్రాన్ని రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదల చేసారు.
కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు కానీ, ఊహించని రీతిలో ఈ సినిమాకి వసూళ్లు రావడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.నాలుగు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కోటి 80 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు రాగా, నేటితో నాలుగు కోట్ల రూపాయిల మార్కుని అందుకొని బ్రేక్ ఈవెన్( Break Even ) మార్కుని దాటనుంది.అలా ఓటీటీ లో విడుదలైన ఒక సినిమా సీక్వెల్ కి ఆడియన్స్ ఈ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారు అంటే ఓటీటీ లో( OTT ) ఈ చిత్రాన్ని ఎన్ని లక్షల మంది వీక్షించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు విడుదలైన సీక్వెల్ కి మొదటి భాగానికి మించిన టాక్ వచ్చింది.ఊహించని మలుపులతో ప్రేక్షకుల మైండ్ ని బ్లాస్ట్ చేసే సన్నివేశాలు ఈ చిత్రం లో బోలెడన్ని ఉన్నాయి.
కానీ ఆడియన్స్ ఊహించినంత హారర్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్( Horror Thrilling Factor ) మాత్రం ఈ చిత్రం లో కనబడలేదని చిన్న కంప్లైంట్ ఉంది.

కానీ కథలో అడుగడుగునా థ్రిల్ కి గురి చేసే స్క్రీన్ ప్లే ఉండడం వల్ల ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది.సినిమా ప్రొమోషన్స్ లో ఈ చిత్రం లో కథానాయకుడిగా చేసిన సత్యం రాజేష్( Satyam Rajesh ) మాట్లాడుతూ, ఈ కథ కేవలం ఒకటి రెండు భాగాలతో చెప్పే సినిమా కాదు, కనీసం 5 భాగాలుగా తియ్యాల్సిన అవసరం ఉందని అంటాడు.‘పొలిమేర 2 ‘ సినిమా చూస్తున్నప్పుడు మనకి ఎన్నో అనుమానాలు ప్రశ్నలు ఏర్పడుతాయి.వీటికి క్లైమాక్స్ లో సమాధానం దొరుకుతుంది అని ఊహించిన ఆడియన్స్ కి కాస్త నిరాశ ఎదురు అవుతాది.ఆ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మూడవ భాగం వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.







