తెలంగాణలో వైఎస్ఆర్టిపి ( YSRTP ) పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి కెసిఆర్ ని పడగొట్టేది నేనే.ఆయనను గద్దెదించేది నేనే.
ఆయనకు ప్రత్యామ్నాయం నేనే అంటూ గొంతు చించుకొని అరిచిన వైస్ షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని స్పష్టం చేసింది.అయితే ఆ మధ్యకాలంలో కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేస్తా అని చెప్పినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులు ఒప్పుకోలేదు.
దానికి బదులుగా ఏపీలో కాంగ్రెస్ సారధిగా బాధ్యతలు తీసుకోమని చెప్పారు.కానీ దానికి షర్మిల ( Sharmila ) ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయలేదు.
కానీ ఆ తర్వాత 119 స్థానాల్లో నేను పార్టీ నుండి అభ్యర్థులను నిలబెడతానని,కాంగ్రెస్ కి గట్టి షాక్ ఇస్తానని,ఇలా ఎన్నో మాట్లాడింది.
కానీ చివరికి తన మద్దతు కాంగ్రెస్( Congress) కే అని తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని స్పష్టం చేసింది.అయితే ఇన్ని రోజులుగా ఎన్నికల్లో పోటీ చేస్తాను అని చెప్పిన షర్మిల సడన్ గా ఇలా ప్లేట్ ఫిరాయించడానికి కారణం ఎవరు.తెరవెనక ఏం జరిగింది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే షర్మిల తెలంగాణకి వచ్చినప్పుడే జగన్ వదిలిన బాణం అని అందరూ భావించారు.
కానీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉండే జగన్ (Jagan) ఎందుకు మళ్ళీ తన చెల్లిని కాంగ్రెస్ వైపు అడుగులు వేసేలా చేస్తున్నారని అందరికీ డౌట్ రావచ్చు.అయితే గత కొద్ది రోజులుగా దేశంలో బిజెపి గ్రాఫ్ డౌన్ అవుతుంది.ఈ నేపథ్యంలోనే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం కనిపిస్తుంది.
అయితే ఇప్పటినుండే కాంగ్రెస్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే భవిష్యత్తు లో తనకి ప్లస్ అవుతుందని భావించిన జగన్ తన ప్లాన్ లో భాగంగానే షర్మిలను కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని చెప్పినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అలాగే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ ( Ponguleti Srinivasa Reddy ) కూడా జగన్ ఆశీస్సులు తీసుకొనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె శివకుమార్ తో కూడా జగన్ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి.ఇక బిజెపి గ్రాఫ్ పడిపోవడం వల్లే ప్రత్యామ్నాయం చూసుకోవాలని జగన్ భావించి కాంగ్రెస్ కి దగ్గరవ్వాలని చూస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అందుకే షర్మిల తో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.