బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) మొదలైనప్పటి నుంచి ఉల్టా పుల్టా అంటూ పిచ్చి పిచ్చి విధానాలు కనిపెట్టి జనాలకు తలపోటు తెప్పించేస్తున్నారు .సరే ఏది ఎలా ఉన్నా చూసేవాళ్ళు చూస్తారు, వదిలేసే వాళ్లు వదిలేస్తారు.
ఇక బిగ్ బాస్ కి మొదటి నుంచి దత్త పుత్రుడు గా ఉన్న శివాజీ( Shivaji ) ఆట తీరు గురించి అందరికి తెలిసిందే.ఆడేది లేదు, పీకేది లేదు.
పైగా దిక్కు మాలిన గరుడ పురాణం అంత చెప్పి పక్కన వాళ్ళను కూడా సరిగ్గా ఆడనివ్వడు.చేతి భుజం ఇంజురీ అయినా హౌస్ లో తన మార్కు చూపిస్తే శిష్యులను పెంచుకుంటూ పోతున్నాడు.
పైగా తన శిష్యరికం వల్లే వాళ్లంతా బాగా ఆడుతున్నట్టు కలర్ ఇస్తూ ఉంటాడు.నాగార్జున( Nagarjuna ) కూడా అందరికి మంచి చెడు చెప్పే బాధ్యత శివాజీ పైనే పెట్టాడు కాబట్టి ఇక ఎక్కడ తగ్గేదే లే అంటూ పనికి మాలిన సొల్లు చెప్తూ బాగానే హౌస్ ఉంటున్నాడు.

దొంగిలించి ఆడే ఆటలో కూడా ఎవరిని దొంగతనం చేయకుండా అడ్డుకోవడం, పైగా దొంగతనం చేస్తే ఎదో నిజమైన దొంగలు అన్నట్టు కలర్ ఇస్తూ పక్క వాళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు.ఒకవైపు శివాజీ ఆటతీరుపై ఇంట్లో అందరు అసంతృప్తి గానే ఉన్నారు.టేస్టీ తేజ( Tasty Teja ) ఈ సారి నాగార్జున ను అడిగేస్తాను అంటూ అందరి ముందు మాట్లాడాడు.గౌతమ్( Gautam ) అయితే కెమెరాలకు వచ్చి తన బాధను చెప్పుకుంటున్నాడు.
శివాజీ ఆటతీరు తనకు నచ్చడం లేదు అని బయటకు కనిపించే మనిషి వేరు, లోపల మరొక మనిషి లాగ ప్రవర్తిస్తాడు అంటూ చెప్పేసాడు.అశ్విని కూడా అందరిని ఒకలా ఎంకరేజ్ చేయడం లేదని కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

మొన్నటికి మొన్న రతిక( Rathika ) రీ ఎంట్రీ ఇవ్వగానే వచ్చి కాళ్లపై పడి క్షమించమని అడగడం, దామిని మీరు చెప్పింది నిజమే సర్ నేను ఏమి ఆడలేదు అని ఒప్పుకోవడం అతడికి బలాన్ని ఇచ్చాయి.ఇదంతా పక్కన పెడితే శివాజీ నిజమైన క్యారెక్టర్ ఇంకా బయటకు రాలేదు అనేది మాత్రం వందకు వంద శాతం నిజం.తాను సరిగ్గా ఆడకుండా పక్కన వాళ్ళ ఆట తీరును ప్రభావితం చేస్తూ ఏం పొడుస్తున్నాడు అని బయట జనాలు కూడా అంటున్న మాట.మరి ఈ ఆటతో ఎన్ని రోజులు హౌస్ లో ఉంటాడో ఇంకా అని అందరు ఫీల్ అవుతున్నారు.ఇంత మంది వ్యతిరేకిస్తున్న ఈ వారాంతం నాగార్జున ఎప్పటి లాగానే అతడిని సమర్దిస్తాడా అని అందరు ఎదురు చూస్తున్నారు.