అడవి శేష్( Adivi Sesh ).టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాల మంది హీరోల కన్నా కూడా మోస్ట్ హ్యాండ్సమ్ హీరో.
ఆలా స్టైలిష్ గా గన్ను పట్టుకుని ఏంటో సీరియస్ గా కాల్చుకుంటూ పోతున్న కూడా అమ్మాయిల హృదయాల్లో ప్రేమ గంటలు మీటుతున్నట్టే అనిపిస్తుంది.అదిరిపోయే స్కిన్ టోన్, అందమైన మొహం, సాలిడ్ బాడీ, అంతకు మించి అద్భుతమైన నటన… ఇవన్నీ కూడా అడవి శేష్ సొంతం.
మొట్ట మొదటి సినిమా ఒక్కటి మినహాయిస్తే హీరోగా అతడు చేసిన సినిమాలు దాదాపు అన్ని విజయాలే.ఒకే తరహా సీరియస్ థ్రిల్లర్స్ జోనర్ కి పరిమితం అయిపోయి అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నాడు అంటూ చాల మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇంత ముద్దుగా ఉన్నావ్ ఒక ముచ్చటైన లవ్ స్టోరీ( Love story ) తీసి అమ్మాయిల విరహ వేదన తీర్చచ్చు కదా అడవి శేష్ అంటూ ఎంతో మంది ఫీల్ అవుతున్నారు.మరి ఈ ఆర్తనాదాలు విన్నాడో ఏమో కానీ గూఢచారి సీక్వెల్( Goodachari 2 ) తో పాటు ఒక ప్రేమ కథను కూడా సమాంతరంగా తెరెకక్కించే ప్లాన్ లో ఉన్నాడనే విషయం తాజాగా బయటకు వచ్చింది.ఈ విషయం ఇప్పుడు టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది.ముప్పై ఏళ్ళు కూడా లేవు అప్పుడే అన్ని ముందర వేషాలు, సీరియస్ సినిమాలు తీసేసిన అడవి శేష్ లవ్ స్టోరీ తో వచ్చి హీరోయిన్స్ రొమాన్స్ చేస్తే చూడాలని ఎంతో మంది వెయిటింగ్ ఇక్కడ.
డిసెంబర్ లో గూఢచారి 2 సెట్స్ పైకి వెళ్తుండగా, లవ్ స్టోరీ సంక్రాంతికే మొదలు పెట్టె అవకాశాలు కూడా ఉన్నాయట.
మరి ఇంత స్ట్రాటజీ తో సినిమాలు చేసే హీరో తెలుగు ఒక్క అడవి శేష్ మాత్రమే ఉన్నాడు.ఒక వేళ లవ్ స్టోరీ తనకు సెట్ కాకపోయినా తనకు అచొచ్చిన జోనర్ చిత్రం అయినా గూఢచారి సినిమా గట్టెక్కిస్తుంది.అందుకే ఈ భారీ ప్లాన్ వేసి రెండు సినిమాలు ఒకేసారి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఎవరి ఎన్ని చెప్పిన మహేష్ బాబు( Mahesh Babu ) తర్వాత ఆ రేంజ్ మ్యాజిక్ చేసిన హీరో అంటే కేవలం అది అడవి శేష్ మాత్రమే.చూడాలి మరి మన సీరియస్ యాక్టర్ ప్రేమ కథలు, రొమాంటిక్ ముచ్చట్లు ఎలా చెప్తాడో ఏంటో ?