బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ) ఆషా మాషి వ్యక్తి కాదు .ఆయన చేసిన వ్యాఖ్యలు , ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే తీరు వెనుక చాలా రాజకీయం ఉంటుంది .
తెలంగాణ ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్తితులు తలెత్తిపోతున్నాయి అనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారు .ముఖ్యంగా తెలంగాణలో ఊహించని విధంగా కాంగ్రెస్ బలోపేతం కావడం, ఆ పార్టీ నేతల్లోనూ అధికారంలోకి వస్తామనే ధీమా కనిపిస్తూ ఉండడం , దీనికి తగ్గట్లుగానే ఇటీవల కాలంలో ఆ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు చోటు చేసుకోవడంతో కెసిఆర్ అలెర్ట్ అవుతున్నారు.దీంతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణలో టిడిపి పై జనాల్లో సెంటిమెంట్ కలగడం , ఆ ప్రభావం సెటిలర్స్ బీ ఆర్ ఎస్ పై అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని గ్రహించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ నే ( YCP )టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే కేసీఆర్ పాల్గొంటున్న ఎన్నికల ప్రచార సభల్లో వైసిపి ప్రభుత్వం పై సెటైర్లు వేస్తున్నారు.

మూడు రోజుల క్రితం సత్తుపల్లిలో పర్యటించిన కేసీఆర్ అక్కడ ఏపీ ప్రభుత్వంపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఏపీలో సింగిల్ రోడ్లు తెలంగాణలో డబల్ రోడ్లు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి .కెసిఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala ramakrishna reddy ) తీవ్రంగా స్పందించారు.కెసిఆర్ ఎన్నికల కోణంలోనే వైసీపీపై విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యలను ఖండించగా, తాజాగా ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరావు కెసిఆర్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు.
దీంతో కేసీఆర్ వ్యవహాత్మకంగానే వైసిపి నేతలను రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేస్తున్నారనే విషయం అర్థం అవుతోంది.కాంగ్రెస్ గత ఎన్నికల కంటే ఈసారి బలం పెంచుకోవడం, టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో బి ఆర్ ఎస్ , తెలంగాణ టిడిపి నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడం, టిడిపి( TDP ) ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు డ్రైవర్ట్ అయ్యే అవకాశం ఉండడంతో కెసిఆర్ వ్యూహాత్మంగానే తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే విధంగా వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది.

తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ఇప్పటికే బీఆర్ఎస్( BRS ) సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టీపై ( Congress )విమర్శలు చేస్తుంది. కాంగ్రెస్ కూడా ఘాటు గానే స్పందిస్తోంది .తమపై నిందలు వేస్తే ప్రజలు ఎవరు నమ్మరని , కావాలని ఏపీలో పరిస్థితుల పై వైసీపీపై విమర్శలు చేస్తూ తెలంగాణ సెంటిమెంటును రాజేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని, బీఆర్ఎస్ , వైసీపీలు కావాలనే ఈ రాజకీయం మొదలుపెట్టాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.







