తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 10వ తేదీ తరువాత ఓటరు స్లిప్ లను పంపిణీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.
రెండు వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
ఈ సారి తొమ్మిది లక్షలకు పైగా కొత్త ఓటర్లు నమోదు అయ్యారని తెలిపారు.ఆదివారం మినహా ప్రతి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుందన్నారు.
ఓటింగ్ ను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.ఈ క్రమంలోనే నగదు పంపిణీ కట్టడికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.