Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి అవమానం.. టీవీ రేటింగ్స్‌లో అత్యంత చెత్త రికార్డు

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా వాల్తేరు వీరయ్య.( Valtheru veeraiah )ఇందులో మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja )కూడా కీలక పాత్రలో నటించాడ.

 Worst Rating For Chiranjeeevi Valtheru Veeraiah In Tv Tollywood-TeluguStop.com

థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఈ సినిమా ఆకట్టుకుంది.బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా… ఇటీవల దసరా పండుగ సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

జెమినీ టీవీలో ఈ సినిమాను ప్రసారం చేశారు.

Telugu Chiranjeevi, Devi Sri Prasad, Ravi Teja, Shruti Haasan, Tollywood, Vennel

అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన టీవీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.వాల్తేరు వీరయ్య షాకింగ్ టీఆర్పీ రేటింగ్స్ ను దక్కించుకుంది.కేవలం 5.14 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే టీవీలో ఈ సినిమా రాబట్టింది.చిరంజీవి లాంటి పెద్ద హీరోకు ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్స్ అవమానంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇద్దరు హీరోలు నటంచిన ఈ సినిమాకు అంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.అయితే ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా.

కేథరిన్ థెరిస్సా కీలక పాత్రల్లో నటించారు.

Telugu Chiranjeevi, Devi Sri Prasad, Ravi Teja, Shruti Haasan, Tollywood, Vennel

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలైంది.ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ( Devi Sri Prasad )మ్యూజిక్ అందించగా.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

ఇప్పటికే ఓటీటీలోకి కూడా ఈ సినిమా వచ్చింది.థియేటర్లు.

, ఓటీటీలో రిలీజ్ కావడంతో టీవీలో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదని, అందుకే తక్కువ టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.చిరంజీవి కెరీర్‌లో 154వ సినిమాగా ఇది రాగా.

అక్టోబర్ 23న సాయంత్రం 6 గం.లకు జెమినీ టీవీలో ప్రసారమైంది.ఓటీటీలోను అదరగొట్టిన ఈ సినిమా.టీవీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు.అర్బన్‌లో 5.14 టీఆర్పీ రాగా, రూరల్ అండ్ అర్బన్‌లో 4.56 మాత్రమే వచ్చింది.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదల అవ్వగా.

బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకుపైగా వసూలు చేసింది.చిరంజీవి కెరీర్‌లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా ఇది నిలిచింది.

నెట్‌ఫ్లి్క్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా కీలక పాత్రల్లో కనిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube