టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున శ్రీలీల( Sreeleela ) పేరే గుర్తుకు వస్తుంది.ప్రస్తుతం ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల సెప్టెంబర్ నెలలో స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక అక్టోబర్లో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక త్వరలోనే వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక డిసెంబర్ నెలలో కూడా నితిన్ తో కలిసిన నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి శ్రీలీలా( Sreeleela ) మరోవైపు వరుస సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.కెరియర్ మొదట్లో కన్నడ సినిమాలలో నటించి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి ఈమె పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు.
అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా తన నటన ద్వారా మాత్రం అందరిని ఆకట్టుకున్నారు.

ఈ సినిమా తర్వాత ధమాకా సినిమా( Dhamaka )తో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీ లీల కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది.
ఇలా తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తమిళ సినిమా అవకాశాలను కూడా అందుకున్నట్టు సమాచారం.ఈమె కోలీవుడ్ స్టార్ హీరో సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది.
అయితే త్వరలో ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నట్టు కోలీవుడ్ సమాచారం.







