సూర్యాపేట జిల్లా:మునగాల మండ( Munagala mandal )ల కేంద్రంలో మిషన్ భగీరథ ( Mission Bhagiratha )పైప్ లైన్ లీకేజ్ కావడంతో నీరు మొత్తం నేలపాలు అవుతున్నాయి.
గత మూడు నెలల నుండి అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లీకేజ్ నీరు సర్వీస్ రోడ్డుపైకి రావడం వల్ల రోడ్డు బురదమయమై స్థానిక ప్రజలు,వచ్చిపోయే వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికైనా స్పందించి పైప్ లైన్ మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.