మనలో చాలామంది సక్సెస్ కావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా ఆ అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకోవడంలో పొరపాట్లు చేసి ఫెయిల్ అవుతుంటారు.అయితే ఒక చిన్నారి మాత్రం రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయినా భరతనాట్యంలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
జగిత్యాల జిల్లాలోని రాయికల్ కు చెందిన బొమ్మకంటి అంజనాశ్రీ సక్సెస్ స్టోరీ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.ఎడమ కాలిని కోల్పోయినా కృత్తిమ కాలుతో నాట్యంలో సత్తా చాటుతున్న ఈ చిన్నారి గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నాలుగేళ్ల వయస్సులోనే ఒక ప్రమాదంలో అంజనాశ్రీ( Anjana sri ) కాలును కోల్పోయారు.ఆ సమయంలో ఎడమ కాలును కోల్పోయిన అంజనా శ్రీ ఈ ఘటన జరిగి ఏడాది కూడా గడవక ముందే ఎడమ కాలుకు సైతం ప్రమాదం జరగడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అయితే కాలును కోల్పోయినా నాట్యంపై అంజనాశ్రీకు ఉన్న ఉత్సాహం మాత్రం తగ్గలేదు.తల్లీదండ్రుల సపోర్ట్ తో కృత్రిమ కాలును ఏర్పాటు చేసుకున్న అంజనా శ్రీ భరతనాట్యంలో శిక్షణ పొంది వేర్వేరు భరతనాట్య కార్యక్రమాలలో పాల్గొని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.అంగ వైకల్యం శరీరానికి తప్ప మనిషికి కాదని ఆమె ప్రూవ్ చేశారు.
అంజన శ్రీ ప్రతిభకు ఎన్నో అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలు దక్కాయి.కాలు లేకపోయినా లక్ష్యం వైపు దృష్టి పెడుతున్న ఈ చిన్నారి సక్సెస్ స్టోరీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.ఈ విషయం సోషల్ మీడియా( Social media ) ద్వారా తెలుసుకున్న నాట్య మయూరి సుధాచంద్రన్( Sudha Chandran ) వీడియో కాల్ చేసి మరీ అంజనాశ్రీని అభినందించారు.
అంజనాశ్రీ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.అంజనా శ్రీ టాలెంట్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.