యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బూతులు మాట్లాడతారా.. సరదాగా ఉంటే అస్సలు ఆపలేమంటూ?

ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే ప్రతిభా పాటవాలు కొంతమందికే ఉంటాయి.అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఒకరు కాగా పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగినా తన స్నేహితులకు గౌరవం ఇచ్చే విషయంలో ఎన్టీఆర్ కు ఎన్టీఆరే సాటి అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Young Tiger Ntr Friendship Become Hot Topic In Social Media Details, Junior Ntr-TeluguStop.com

తన బాల్య స్నేహితులతో, ఇండస్ట్రీ స్నేహితులతో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం తారక్ దేవర( Devara ) షూటింగ్ లో భాగంగా గోవాలో ఉండగా అక్కడ తన స్నేహితులతో “చావ ****” అంటూ బూతులు మాట్లాడిన క్లిప్ ఒకటి వైరల్ అయింది.

అయితే దేవర షూటింగ్ స్పాట్ కావడంతో ఆ వీడియోను మేకర్స్ సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు.ఈ విషయం తెలిసిన నెటిజన్లు స్నేహితులతో తారక్ ఇంత సరదాగా ఉంటారా అని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

తారక్ సరదాగానే, స్నేహితులతో( NTR Friends ) ఉన్న చనువు వల్లే బూతులు మాట్లాడారే తప్ప అంతకు మించి ఆయన బూతులు మాట్లాడటం వెనుక మరో రీజన్ లేదని నెటిజన్లు చెబుతున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో కాబట్టి కొంతమంది ఆయనపై నెగిటివ్ కామెంట్లు చేసే ఛాన్స్ అయితే ఉంది.దేవర సినిమా తర్వాత తారక్ కెరీర్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది.

ప్రశాంత్ నీల్( Prasanth Neel ) సినిమాతో పాటు వార్ 2 సినిమాతో( War 2 ) తారక్ కెరీర్ పరంగా బిజీ కానున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కు వరుస విజయాలు దక్కుతుండగా ఆరు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న ఈ హీరో రాబోయే రోజుల్లో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించి ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ టాలెంట్ ను చాలామంది దర్శకులు సరిగ్గా వాడుకోవడం లేదని నెటిజన్లు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube