వరుణ్‌ పెళ్లికి అకీరా ఎందుకు వెళ్లలేదు?

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి వేడుక వైభవంగా జరుగుతోంది.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌( Mega Prince Varun Tej ) తాను సుదీర్ఘ కాలం గా ప్రేమించిన అమ్మాయి లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) మెడలో నేడు మెగా ఫ్యామిలీ సమక్షం లో మూడు ముళ్లు వేయబోతున్నాడు.

 Pawan Kalyan Son Akira Nandan Not Went To Varunlav Marriage , Mega Prince Varun-TeluguStop.com

ఇప్పటికే మెగా ఫ్యామిలీ కి చెందిన మెజార్టీ సభ్యులు ఇటలీ కి వెళ్లారు.మెగా ఫ్యాన్స్ కోసం వరుణ్ తేజ్ పెళ్లి వేడుక ఫోటోలు మరియు వీడియో లు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి.

అయితే ఈ పెళ్లి వేడుక లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల తనయుడు అయిన అకీరా నందన్ లేకపోవడం వెలితిగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో అకీరా మరియు ఆద్య ఎందుకు ఇటలీ వెళ్లలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

గతం లో నిహారిక ( niharika )పెళ్లి సమయం లో పవన్‌ కళ్యాణ్ స్వయంగా వారిని వెంట ఉండి మరీ తీసుకు వెళ్లాడు.కానీ ఈసారి మాత్రం తన భార్య అన్నా లెజ్నోవా తో కలిసి వెళ్లాడు.

ఆ భార్య పిల్లలు కూడా పవన్ వెంట లేరు.

Telugu Akiranandan, Pawan Kalyan, Varun Lav, Varun Tej-Movie

అంటే ఈసారి కేవలం పవన్ దంపతులు మాత్రమే పెళ్లికి హాజరు అయ్యారు.ఆయన నలుగురు పిల్లల్లో ఏ ఒక్కరు కూడా పెళ్లికి హాజరు అవ్వలేదు అని తేలిపోయింది.ఇక రామ్‌ చరణ్‌ మరియు ఉపాసన దంపతులు పాప తో సహా ఇటలీ వెళ్లారు.

అయితే అల్లు అర్జున్ మరియు స్నేహా రెడ్డి లు మాత్రం పెళ్లికి పిల్లల తో వెళ్లలేదు.మొత్తానికి పెళ్లి విదేశా ల్లో అది కూడా యూరప్ లో జరుగుతూ ఉన్న కారణంగా పిల్లలతో అంతదూరం జర్నీ అనే ఉద్దేశ్యంతో పెద్దల వరకు వెళ్ల ఉంటారు అంటున్నారు.

అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల పెళ్లి నేడు.నిన్న మొన్న పెళ్లికి ముందు కార్యక్రమాలు జరిగాయి.నేడు లాంచనంగా పెళ్లి జరుగబోతుంది.

వచ్చే వారం లో హైదరాబాద్‌ లో రిసెప్షన్ ఉంటుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube