చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుండి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.రాజకీయాలలో ఎప్పుడు కూడా బయటకు రాని ఆమె.
భర్త అరెస్ట్ కావటంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి పార్టీ కార్యకర్తలకు.నాయకులకు ధైర్యం చెబుతూ రాణించారు.
ఈ క్రమంలో 52 రోజుల తర్వాత చంద్రబాబుకి( Chandrababu Naidu ) బెయిల్ రావడం.జైలు నుంచి విడుదల కావడంతో నారా భువనేశ్వరి ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.“చంద్రబాబు గారి అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన… తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచింది.అయితే ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది.

సత్యం యొక్క బలం ఎంతో చూపించింది.ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి.నిజం గెలవాలి( Nijam Gelavali ) అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి సోదరుడికి, ప్రతి మహిళకు, ప్రతి పౌరుడికి శిరసు వంచి కృతజ్ఞతలు చెపుతున్నా.నా భర్త అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడే బస చేసిన నన్ను మీ ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ( Rajamahendravaram ) ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.
ఆ దేవుడి దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటూ….మీ నారా భువనేశ్వరి” అని ట్వీట్ చేశారు.







