ఓ ట్యూషన్ టీచర్( Tution Teacher ) ప్రియుడు ఆమె వద్ద ట్యూషన్ కు వచ్చే పదవ తరగతి విద్యార్థిని పక్క ప్రణాళిక ప్రకారం అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ కుమారుడిని కిడ్నాప్ చేశానని, డబ్బులు ఇస్తేనే విడుదల చేస్తానని బెదిరించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని( Uttar Pradesh ) కాన్పూర్ లో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళ్తే.కాన్పూర్ లో 21 ఏళ్ల రచిత( Rachita ) అనే యువతి స్కూల్ పిల్లలకు ట్యూషన్ నడుపుతోంది.
ఈమె వద్దకు 17 ఏళ్ల పదవ తరగతి విద్యార్థి ట్యూషన్ కు వెళ్తుంటాడు.అయితే ట్యూషన్ టీచర్ రజితకు, ఆ 17 ఏళ్ల విద్యార్థికి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానం రజిత ప్రియుడు ప్రభాత్ శుక్లా కు( Prabhat Shukla ) వచ్చింది.
దీంతో ఆ యువకుడ్ని చంపాలని నిర్ణయించుకున్నాడు.
పక్కా ప్లాన్ ప్రకారం బాలుడి ఇంటికి వెళ్లి ట్యూషన్ టీచర్ రజిత పిలుస్తుందని ఆ బాలుడిని తన బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు.ఇద్దరూ కలిసి ఓ స్టోర్ రూమ్ లోకి వెళ్లారు.20 నిమిషాల తర్వాత కేవలం ప్రభాస్ శుక్లా మాత్రమే బయటకు వచ్చి తన దుస్తులు మార్చుకొని బైక్ పై వెళ్లిపోయాడు.
అనంతరం మృతుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కిడ్నాప్ చేశానంటూ( Kidnap ) బెదిరించడంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది.ప్రభాత్ శుక్లా ఆ బాలుడిని బైక్ పై స్టోర్ రూమ్ వద్దకు తీసుకెళ్లిన దృశ్యాలు, 20 నిమిషాల తర్వాత శుక్లా ఒక్కడే బయటికి వచ్చిన దృశ్యాలు మొత్తం రికార్డు అయ్యాయి.
నిందితుడు ప్రభాత్ శుక్లా, అతని ప్రియురాలు ట్యూషన్ టీచర్ రచిత తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.హత్యకు గల కారణాలు ఏమిటో తెలియలేదు.విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.