మాస్ మహారాజా రవితేజ( Ravi teja ) హీరోగా వంశీ దర్శకత్వం లో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) మొన్న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా, ఆయన జీవితం గురించి బయట ఉన్న ప్రచారం మరియు పుకార్ల ను బేస్ చేసుకుని కల్పిత కథ తో రియల్ పాత్ర ల ఆధారంగా సినిమా ను రూపొందించడం జరిగింది.
ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్ర లో నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా లేదు అంటూ కొందరు పెదవి విరిచారు.
ఆ విషయం పక్కన పెడితే భారీ ఎత్తున నెగటివ్ ట్రోల్స్ వచ్చినా కూడా సినిమా మొదటి వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి దాదాపుగా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను నమోదు చేయడం జరిగింది.
లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్లు చేస్తుందో తెలియదు కానీ ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ కాలేదు అంటున్నారు.బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఓవరాల్ గా 40 శాతం వరకు వసూళ్లు ఇంకా రావాల్సి ఉందట.కొన్ని ఏరియాల్లో 50 నుంచి 60 శాతం వసూళ్లు రావాల్సి ఉంది.
ఒకటి రెండు చోట్ల బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ దగ్గరకు వచ్చి ఆగే పరిస్థితి ఉందని టాక్.
మొత్తానికి ఈ సినిమా యొక్క వసూళ్లు నిరాశ కలిగించే విగా ఉన్నాయి అంటున్నారు.మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమా ను రూపొందించి ఉంటే కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యేవి., బ్రేక్ ఈవెన్ కూడా సాధ్యం అయ్యేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao ) వసూళ్ల విషయం లో ఇంకా కూడా యూనిట్ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.