టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,( Varun Tej ) సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిల పెళ్లి ( Lavanya Tripathi )వేదికకి సంబందించి ఎప్పుడైతే అఫిసియల్ అనౌన్స్ మెంట్ వచ్చిందో అప్పటినుండి వీరి గురించి ఏదో ఒక వార్తను మనం వింటూనే వున్నాం.కాగా వీరి పెళ్లి రేపు అనగా నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మెగా ఫ్యామిలీ.
ఆల్రెడీ రెండు మూడు రోజుల క్రితమే వివాహానికి సంబందించిన ఒక్కో వేడుక అక్కడ జరుగుతూ వస్తోంది.దానికి సంబందించిన అప్డేట్లు మనం కూడా వింటూ వున్నాం.
కాగా కుమారుడి పెళ్లిని మెగా బ్రదర్ నాగబాబు( Naga Babu ) ఇటలీలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.
వివాహం తర్వాత రిసెప్షన్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తారట.ఈ డేట్ ను కూడా ఆల్రెడీ ఫిక్స్ చేశారు.నవంబర్ 5న వీరి రిసెప్షన్ కు హైదరాబాద్ వేదిక కానుంది.
దీనికి సినీ ప్రముఖులు అందరూ హాజరుకానున్నారు.ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే అసలు ఇటలీలో వీరి వివాహం ఎందుకు చేస్తున్నారనే అనుమానం చాలా మందిలో ఉంది.
వరుణ్ సోదరి నిహారిక( Niharika ) పెళ్లి రాజస్థాన్ లో గ్రాండ్ గా చేయగా ఇప్పుడు వరుణ్ పెళ్లి ఇటలీలో చేయడం వెనుక గల కారణాలు ఏమిటని అందరూ శోధిస్తున్నారు.
ఇకపోతే వీరిద్దరు కలిసి మిస్టర్ సినిమాలో( Mister movie ) నటించిన సంగతి విదితమే.ఆ సినిమా షూటింగ్ లో కొన్ని సీన్లు ఇటలీలో చిత్రీకరించడం జరిగింది.కొన్ని పాటలు కూడా అక్కడే షూట్ చేశారు.
ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.అలా వీరిద్దరు ప్రేమలో పడ్డారు.
కాగా ప్రేమ పుట్టిన చోటనే పెళ్లి అనే బంధంతో వీరిద్దరూ ఒకటి కావాలని పట్టుబట్టారట.అందుకే వీరి వివాహం ఇటలీలో ప్లాన్ చేశారు.
అది అసలు విషయం… ఇప్పుడైనా అర్ధం అయిందా? కాగా ఇప్పటికే ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు అందరూ ఇటలీ చేరుకోవడం జరిగింది.ఇక రిసెప్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించారు కాబట్టి ఇక్కడికి ప్రముఖులు హాజరవుతారని సమాచారం.
అంతేకాకుండా ఈ రిసెప్షన్ కోసం రాష్ట్రంలో వున్న కొంతమంది అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారని, వారికి కూడా ఆహ్వానం ఇవ్వడానికి మెగా ఫ్యామిలీ( Mega Family ) ప్లాన్ చేస్తుందని వినికిడి.