తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఒకరు…ఈయన మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో ఒక మంచి స్థాయిలో ఉన్నారు.ఇక ప్రస్తుతం విజయ్ చేసిన ప్లాప్ సినిమాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం…

విజయ్ దేవరకొండ కెరియర్ మొదట్లో పెళ్లి చూపులు(Peḷli chupulu) అర్జున్ రెడ్డి(Arjun Reddy) లాంటి సినిమాలు చేయడం జరిగింది.ఈయన ప్రస్తుతం చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోడం తో పాటుగా స్టార్ హీరో రేస్ లో ఈయన ముందంజలో ఉన్నాడు.ఇక ఈయన తన కెరీర్ లో అర్జున్ రెడ్డి లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దాంతోపాటుగా నోటా (Nota)అనే ఒక సినిమా తీశాడు.
ఆ సినిమా చేసి ఆయన చాలా పెద్ద తప్పు చేశానని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది.

నిజానికి ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేకపోయారు ఇక ఇలాంటి క్రమంలో మరోసారి ఇలాంటి వరస్ట్ సినిమాలు చేయకూడదు అనే ఆలోచనలో ఉన్నారు.అందుకే ఆయన ప్రస్తుతం చూస్తున్న సినిమాలన్నీ కూడా కథ పూర్తిగా విన్న తర్వాత అప్పుడు తనకు నచ్చితే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు లేకపోతే ఆ ప్రాజెక్ట్ ని వదిలేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే పూరి జగన్నాథ్(Puri Jagannath) డైరెక్షన్ లో వచ్చిన లైగర్ సినిమా(Liger movie) కూడా డిజాస్టర్ గా మిగిలిందనే చెప్పాలి.
ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా షాక్ ఇచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలింది…ఇక దాంతో ఇప్పుడు చేసే సినిమాలు చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు…
.







