ఎలుగుబంట్లు( Bears ) చాలా తెలివైన జంతువులు వీటి బ్రెయిన్ వాటి బాడీ సైజ్‌తో పోల్చుకుంటే చాలా పెద్దగా ఉంటుంది.ఒక్కోసారి అవి కొన్ని పనులలో మనుషులతో సమానంగా తెలివిని ప్రదర్శిస్తాయి.
అలానే ఇవి ఆహారం లభించే ప్రాంతాలను 10 ఏళ్ల వరకు గుర్తు పెట్టుకోగలవు.అలాగే టచ్ స్క్రీన్ పై తమకు కావాల్సింది పొందడానికి సరైన ఆప్షన్స్ నొక్కగలవు.
ఇంకా వీటి తెలివికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ తాజాగా వాటికి మించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

చైనీస్ జూ( China zoo )లో ఒక ఎలుగుబంటి మనిషిని ఇమిడియెట్ చేస్తూ కనిపించింది.ఈ వీడియో క్లిప్‌లో, మూడు ఎలుగుబంట్లు తమ వెనుక కాళ్లపై నిలుచుని ఉండటం చూడవచ్చు.ప్రముఖ డ్యాన్స్ మూవ్ అయిన ‘ఫ్లవర్ హ్యాండ్‌షేక్’ చేస్తున్న మనిషిని చూసే అది కూడా ఆ డ్యాన్స్ చేయడం గమనించవచ్చు.

రెండు చేతుల మణికట్టులను తలపై సర్కులర్ షేప్ లో కదిలించడాన్ని ఫ్లవర్ హ్యాండ్‌షేక్ డ్యాన్స్ అంటారు.సాధారణంగా ఈ డాన్స్ చాలా సింపుల్ కానీ చూడ్డానికి బాగుంటుంది.మూడు నల్ల ఎలుగుబంట్లు, ఆశ్చర్యకరంగా, వాటి వెనుక కాళ్ళపై నిలబడి తమను చూసేందుకు వచ్చిన జూ విజిటర్ ను అనుకరించాయి.ముఖ్యంగా ఒక ఎలుగుబంటి మనిషిని చాలా చక్కగా ఇమిటేట్ చేసింది.
న్యూయార్క్ పోస్ట్ ఈ వీడియోను అక్టోబర్ 25, బుధవారం నాడు యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా అది క్షణాల్లోనే వైరల్ గా మారింది.ఈ వీడియోకి ఇప్పటివరకు 5 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
దీన్ని మీరు కూడా చూసేయండి.







