సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) కి మన టాలీవుడ్ లో మొదటి నుండి మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఒకానొక సమయం లో ఆయన సినిమాలకు ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు మించి వసూళ్లను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి.
కానీ మధ్య లో వరుసగా కొన్ని ఫ్లాప్స్ రావడం వల్ల ఆయన మార్కెట్ కాస్త తగ్గిన విషయం వాస్తవమే కానీ, ఈ ఏడాది ‘జైలర్’ ( jailer )చిత్రం తో మాత్రం సంచలనం సృష్టించి సౌత్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసాడు.తెలుగు వెర్షన్ లో కూడా ఈ సినిమా దాదాపుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానమైన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.వీరిలో శివ రాజ్ కుమార్ పాత్రకి రజినీకాంత్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్ లో.

అయితే ఈ పాత్రని తొలుత నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) కోసం రాసుకున్నది డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilip Kumar ).కానీ బాలయ్య ఎందుకో ఈ పాత్రలో నటించడానికి నిరాకరించాడు.ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, గతం లో బాలయ్య మరియు రజినీకాంత్ కాంబినేషన్ లో రెండు సూపర్ హిట్ సినిమాలు మిస్ అయ్యాయి.బాలయ్య కి రజినీకాంత్ అటు రాజకీయపరంగాను మరియు సినిమాల పరంగాను మంచి స్నేహితుడు,ఆత్మీయుడు.
గతం లో ఎన్నో సందర్భాలలో వీళ్లిద్దరు కలుసుకున్నారు కూడా.ఆరోజుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘మాపిళ్ళై’( Mapillai ) చిత్రం లో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో బాలయ్య బాబు ని నటించాల్సిందిగా కోరాడట రజినీకాంత్.
కానీ అదే సమయం లో బాలయ్య ఫారిన్ లో షూటింగ్ చేస్తుండడం వల్ల ఆ పాత్ర ని ఆయన చేయలేకపోయారు.ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ని అడగగానే వెంటనే ఒప్పుకొని ఈ సినిమాని చెసాడు.

మెగాస్టార్ పోషించిన ఈ అతిథి పాత్రకి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అంతే కాదు మోహన్ బాబు( Mohan Babu ) హీరో గా నటించిన ‘పెదరాయుడు’ చిత్రంలో రజినీకాంత్ పాత్రకి ఆరోజుల్లో వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్ ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమాని తొలుత బాలయ్య బాబు తో చెయ్యాలని అనుకున్నారట.మోహన్ బాబు పాత్ర ని బాలయ్య బాబు తో నటింపచేయాలని అనుకున్నారు.కానీ ఈ సినిమా కూడా వీళ్లిద్దరి కాంబినేషన్ లో మిస్ అయ్యింది.అలా సౌత్ లో ఈ క్రేజీ కాంబినేషన్ మూడు సార్లు మిస్ అయ్యింది.
భవిష్యత్తులో అయినా సెట్ అవుతుందో లేదో చూడాలి.







