యాపిల్ అంటే మనకు ఎర్ర ఎర్రగా ఉండే పండ్లే మదిలోకి వస్తాయి.కానీ రెడ్ యాపిల్ తో పాటు మనకు గ్రీన్ యాపిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
గ్రీన్ యాపిల్స్( Green Apples ) లో కాల్షియం, ఐరన్, విటమిన్స్, డైటరీ ఫైబర్ తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉంటాయి.ఆరోగ్యపరంగా గ్రీన్ యాపిల్స్ అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి గ్రీన్ యాపిల్ ఒక వరమనే చెప్పుకోవచ్చు.గ్రీన్ యాపిల్ ను రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా సరే సన్నబడతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాలంటే గ్రీన్ యాపిల్ ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక గ్రీన్ యాపిల్ ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ యాపిల్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా గ్రీన్ యాపిల్ ఆల్మండ్ స్మూతీ( Green Apple Almond Smoothie ) సిద్ధం అవుతుంది.
ఈ స్మూతీని రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే చాలా మంచిది.

ముఖ్యంగా ఈ గ్రీన్ యాపిల్ ఆల్మండ్ స్మూతీ ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.చిరు తిండ్లపై మనసు మళ్లకుండా చేస్తుంది.మెటబాలిజం రేటు( Metabolism Rate )ను పెంచుతుంది.
అధిక కొవ్వును కరిగిస్తుంది.వెయిట్ లాస్ కు అద్భుతంగా తోడ్పడుతుంది.
అలాగే ఈ గ్రీన్ యాపిల్ ఆల్మండ్ స్మూతీని తీసుకోవడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.
రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.







