ప్రముఖ టూవీలర్ తయారుదారు హోండా ఇండియాలో( Honda India ) ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫెస్టివ్ ఆఫర్స్( Festive Offers ) ప్రకటించింది.హోండా బైక్స్, స్కూటర్ రిలయబిలిటీకి కేరాఫ్ అడ్రస్ కాబట్టి వీటిని చాలా ఎక్కువ మంది కొంటుంటారు.
వారందరూ డిస్కౌంట్‌తో పాటు అదిరిపోయే ఆఫర్లతో డబ్బు ఆదా చేసుకోవడానికి ఇదే మంచి సమయం.మరి హోండా తీసుకొచ్చిన ఆ ఆఫర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది.అంటే ఒక హోండా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత రూ.5,000 వరకు మనీ తిరిగి పొందొచ్చు.అలానే జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీని అందిస్తోంది.నో కాస్ట్ ఈఎంఐతో( No Cost EMI ) పాటు 6.99% తక్కువ వడ్డీ రేటుతో బైక్ లోన్ తీసుకోవచ్చు.అలానే హైపోథెకేషన్ ఉండదు.
ఈ ఆఫర్లు పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంటాయి.నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయని గమనించాలి.

ఇక హోండా CB300R (OBD2-కంప్లైంట్ వెర్షన్) ధరను కంపెనీ తగ్గించింది.ప్రస్తుతం దీని ధర రూ.2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), ఇది మునుపటి ధర కంటే రూ.37,000 తక్కువ.ఈ బైక్‌కు బజాజ్ డామినార్ 400,( Bajaj Dominor 400 ) టీవీఎస్ అపాచీ RTR 310,( TVS Apache RTR310 ) KTM 390 డ్యూక్, BMW G 310 R పోటీ ఇస్తున్నాయి.DOHC సెటప్ మరియు లిక్విడ్ కూలింగ్‌తో 286 cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో ఇది నడుస్తుంది.9,000 rpm వద్ద 29.98 bhp గరిష్ట శక్తిని, 7,500 rpm వద్ద 27.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ట్రాన్స్‌మిషన్ విషయానికొస్తే ఇది స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

లిమిటెడ్ ఎడిషన్ హోండా యాక్టివాను( Honda Activa ) కూడా కంపెనీ తీసుకొచ్చింది.దీని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.80,734 (ఎక్స్-షోరూమ్), స్మార్ట్ వేరియంట్ ధర రూ.82,734 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.లిమిటెడ్ ఎడిషన్ రెండు కొత్త కలర్ స్కీమ్స్‌లో అందుబాటులో ఉంది.
ఇందులో పెర్ల్ సైరన్ బ్లూ, మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ ఉన్నాయి.బాడీ ప్యానెల్స్‌పై బ్లాక్ కలర్ క్రోమ్ యాక్సెంట్స్, చారలు ఉన్నాయి.
యాక్టివా 3D చిహ్నంపై ప్రీమియం బ్లాక్ క్రోమ్ గార్నిష్, మానసిక ప్రశాంతత కోసం ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన డిఎల్‌ఎక్స్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.







