టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ రెండో విడత యాత్ర వచ్చే వారంలో ప్రారంభం కానుంది.
ఈ మేరకు ఉత్తరాంధ్రలో భువనేశ్వరి పరామర్శ యాత్రను కొనసాగించనున్నారు.
ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో యాత్ర సాగనుంది.చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న బాధతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు.
ఇప్పటికే మొదటి విడత యాత్రను పూర్తి చేసిన భువనేశ్వరి తిరుపతి, శ్రీకాళహస్తి మరియు చంద్రగిరి నియోజకవర్గాల్లో పర్యటించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.