'మ్యాడ్' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఆడియన్స్ కి ఇక పండగే!

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో అత్యధిక శాతం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించినవి చిన్న సినిమాలే అవ్వడం విశేషం.పెద్ద సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలై ఆశించిన స్థాయిలో ఆడలేదు.

 Sangeeth Shoban Narne Nithin Mad Movie Ott Release Date Locked Details, Sangeeth-TeluguStop.com

అలా పెద్ద సినిమాలు భారీగా నష్టాలు తెస్తున్న సమయం లో చిన్న సినిమాలే కాపాడాయి.చిన్న సినిమాల తర్వాత తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ఇరగ కుమ్మాయి.

దసరా ప్రారంభం అయ్యే ముందు విడుదలైన మరో చిన్న సినిమా ‘మ్యాడ్’( Mad Movie ) బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నటించిన నటీనటులు మొత్తం కొత్తవాళ్లే అవ్వడం విశేషం.

అందులో ప్రముఖ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్( Sangeeth Shoban ) ఒకడు కాగా, జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్( Narne Nithin ) కూడా ఒకడు.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేసింది.

Telugu Mad, Mad Ott, Narne Nithin, Netflix, Ott, Sangeeth Shoban, Skanda-Movie

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ఈ చిత్రానికి మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే క్లోసింగ్ లో దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట.అంటే పెట్టిన డబ్బులకు రెండింతల లాభాలు వచ్చాయి అన్నమాట.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో( OTT ) విడుదల అవుతుందా అని ఆడియన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే కరోనా తర్వాత ఒక సెక్షన్ ఆడియన్స్ పూర్తిగా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు.

దీంతో అప్పటి నుండి చిన్న బడ్జెట్ మీడియం రేంజ్ సినిమాలకు ఎంత పెద్ద పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు.అలా ఈ సినిమాకి కోసం కూడా ఎదురు చూసారు.

సినిమా థియేట్రికల్ విడుదలకు ముందే భారీ రేట్ కి నెట్ ఫ్లిక్స్ సంస్థ( Netflix ) ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింది.

Telugu Mad, Mad Ott, Narne Nithin, Netflix, Ott, Sangeeth Shoban, Skanda-Movie

ముందుగా అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని నాలుగు వారాల లోపు ఓటీటీ లో విడుదల చెయ్యాలి.ఆ అగ్రిమెంట్ ప్రకారమే ఈ చిత్రాన్ని వచ్చే నెల 3 వ తారీఖున తెలుగు, హిందీ , తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల చెయ్యబోతున్నారు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుంది.

ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చే ముందు, అనగా నవంబర్ 2 వ తేదీన ‘స్కంద’ చిత్రం( Skanda ) ఓటీటీ లో విడుదల కానుంది.ఇలా వరుసగా రెండు క్రేజీ సినిమాలు ఓటీటీ లో విడుదల అవ్వబోతుండడం ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దక్కనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube