నా చికిత్స కోసం నా భర్త ఆస్తులు అన్ని అమ్మేశారు... ఎమోషనల్ అయిన డైరెక్టర్ వైఫ్?

తమిళంలో సూర్యవంశం, తెలుగులో చెప్పవే చిరుగాలి వసంతం వంటి సినిమాలకు దర్శకుడిగా పని చేస్తున్నటువంటి విక్రమాన్ ( Vikraman ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Director Vikraman Sell Properties For His Wife Treatment , Vikraman, Jayapriya,-TeluguStop.com

అయితే దాదాపు గత పది సంవత్సరాలుగా ఇండస్ట్రీకి ఈయన దూరంగా ఉన్నారు అయితే ఈయన సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాలను తాజాగా తన భార్య తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.డైరెక్టర్ విక్రమ్ భార్య జయ ప్రియ ( Jayapriya ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

కేవలం నా అనారోగ్య సమస్యల కారణంగానే తన భర్త సినిమాలకు దూరమయ్యారని ఈమె ఎమోషనల్ అయ్యారు.

Telugu Jayapriya, Kollywood, Vikraman-Movie

మొదట్లో నాకు కాస్త వెన్నునొప్పి ఉండడంతో హాస్పిటల్ కి వెళ్ళాను అక్కడికి వెళ్లిన తర్వాత స్కాన్ చేసి చూడగా ఇది క్యాన్సర్ లాగా ఉంది బయాప్సీ చేయాలి అని చెప్పారు.కానీ నా భర్త ఈ విషయంలో కాస్త భయపడి ఎలాంటి ఆపరేషన్స్ వద్దని చెప్పారు కానీ అది నిజంగానే క్యాన్సర్ అయితే కష్టం కదా అని నేను ఆపరేషన్ కి ఒప్పుకున్నాను అరగంటలో ఆపరేషన్ అయిపోతుంది అని డాక్టర్లు చెప్పారు దీంతో ఆపరేషన్ కి వెళ్లగా దాదాపు మూడున్నర గంట పాటు ఆపరేషన్ చేశారని ఆపరేషన్ చేసిన తర్వాత పది రోజులకు నేను కనీసం నడవడానికి కూడా వీలుకాకుండా పోయిందని తెలిపారు.

Telugu Jayapriya, Kollywood, Vikraman-Movie

భరతనాట్యం చేస్తే నేను అడుగు తీసి అడుగు పక్కన పెట్టలేకపోతున్నాను ప్రతిరోజు నాకు ఇద్దరు నర్సులు ఇంట్లో సేవ చేస్తున్నారు.కనీసం మూత్ర విసర్జన వెళ్లడానికి కూడా నాకు చేతకావడం లేదని నా ఆరోగ్యం కోసం నాకు చికిత్స చేయించడం కోసం తన భర్త ఇన్ని సంవత్సరాలు పాటు సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన ఆస్తులు అన్నింటిని కూడా అమ్మేసారని ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.ఇప్పటికీ కొంతమంది ఆయనని సినిమాలు చేయమని అవకాశాలు కల్పిస్తున్నారు కానీ నన్ను ఈ పరిస్థితులలో వదిలేసి ఆయన సినిమాలు చేయడానికి కూడా ఇష్టపడటం లేదు అంటూ జయ ప్రియ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube