తమన్ వర్సెస్ బోయపాటి శ్రీను.. మాకేందయ్యా ఈ లొల్లి

సినిమా పరిశ్రమలో ప్రముఖులు ఒక్కోసారి మాటలు జారుతుంటారు.వాటి వల్ల చివరికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.

 Boyapati V/s Thaman Fight, Boyapati, Thaman, Boyapati Srinu , Tollywood ,-TeluguStop.com

ఉదాహరణకి ఇటీవల సుమ ఒక పంచు వేసి జర్నలిస్టులకు చివరికి సారీ చెప్పుకుంది.ఇప్పుడు బోయపాటి శ్రీను( Boyapati Srinu )కి అలాంటి పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల బోయపాటి ఒక సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ కంటెంట్ బాగుండాలి, సీన్ మంచిగా పండాలి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పెద్దగా పని ఏం లేదు అని అన్నాడు.

అయితే అతను ఎస్ఎస్ తమన్( Thamanm ) సంగీతాన్ని ఉద్దేశించి ఈ మాటలు చేశాడని మీడియా సంచలన కథనాలు రాయడం మొదలెట్టింది.అయితే ఇలాంటి ప్రచారం సాగుతున్నా బోయపాటి శ్రీను ఆ వార్తలను ఖండించలేదు.

దాన్నిబట్టి అతను నిజంగానే తమన్ మ్యూజిక్ ని చులకన చేశాడని తెలుస్తోంది.

Telugu Akhanda, Boyapati Srinu, Skanda, Thaman, Tollywood, Vinayavidheya-Movie

వివరాల్లోకి వెళితే, ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో బోయపాటిని ప్రశ్నిస్తూ. ‘అఖండ సినిమా( Akhanda )ని తమన్ బిజీఎం మరో లెవల్ కి తీసుకెళ్ళింది.కానీ స్కంద( Skanda )కి అతను అందించిన మ్యూజిక్ బాగోలేదు.

దానిపై మీ రియాక్షన్’ అని అడిగారు.అయితే దీనికి సమాధానం చెబుతూ బోయపాటి తమన్ మ్యూజిక్ గురించి తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించాడు.

అఖండ సినిమాని మ్యూజిక్ లేకుండా చూసినా అదే కిక్కు ఇస్తుందని, కథలో ఆ దమ్ము ఉందని అంటూ తమన్‌ను పరోక్షంగా తక్కువ చేసి మాట్లాడాడు.

Telugu Akhanda, Boyapati Srinu, Skanda, Thaman, Tollywood, Vinayavidheya-Movie

దీనికి తమన్‌ నొచ్చుకున్నట్లు కూడా తెలుస్తోంది.సీన్‌లో దమ్ము లేనప్పుడు ఎంత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినా వేస్ట్ అన్నట్లుగా అతడు తన మ్యూజిక్ ని సమర్థించుకున్నాడు అలాగే బోయపాటి శ్రీను చెత్త సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని అర్థము వచ్చేట్లు కౌంటర్ ఇచ్చాడు.జయ జానకి నాయక, వినయ విధేయ రామ, ఇటీవల వచ్చిన స్కంద ఈ సినిమాలన్నీ కూడా హీరోలు సిగ్గుపడేంత పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి.

అలాంటి చెత్త సినిమాలు తీసే బోయపాటి శ్రీను( Boyapati Srinu ) తమన్ గురించి తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నట్లు తమన్ ఫాన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు.ట్యూన్లు కాపీ కొట్టినా సరే, కొన్ని సినిమాల్లో మ్యూజిక్ బాగా లేకపోయినా సరే ఇప్పుడు తమన్‌ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నట్టు గుర్తు చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్లందరికీ వరుసగా సక్సెస్‌లు రావడం జరగదని కూడా పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube