ప్రస్తుతం ఎక్కడ చూసినా కృత్రిమ మేథ (ఏఐ) గురించే చర్చ.మనిషికి మించి ఆలోచిస్తూ, అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పనులు చేసే ఏఐ టెక్నాలజీతో భవిష్యత్తులో ఎన్నో విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తులో జరగబోయే నష్టం మన ఊహకు కూడా అందదని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాలు , అభివృద్ధి చెందిన దేశాలు అలర్ట్ అయ్యాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) నుంచి ఎదురయ్యే ముప్పు, టెక్నాలజీ దుర్వినియోగంపై ఫోకస్ పెట్టాయి.కానీ కొన్ని అంశాల్లో కృత్రిమ మేథను వినియోగించుకోవాలని పలు దేశాలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నియంత్రించడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఐక్యరాజ్యసమితి( United Nations ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్( Secretary General Antonio Guterres ) ప్రకటించిన ఏఐ అడ్వైజరీ బాడీలో భారతదేశానికి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులకు స్ధానం దక్కింది.ప్రభుత్వ, ప్రైవేట్, పరిశోధనా రంగం, పౌర సమాజం, విద్యా రంగ నిపుణులను ఒక చోటికి చేర్చి ఏకాభిప్రాయాన్ని రూపొందించడంపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది.కృత్రిమ మేథలో సవాళ్లు, నష్టాలు, దానిని వినియోగించడం, నియంత్రించడంపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి వాటిపై ఈ సంఘం సలహాలు ఇస్తుంది.

ఇకపోతే.ఏఐ అడ్వైజరీ బాడీ సభ్యులలో భారతీయులైన అమన్‌దీప్ సింగ్ గిల్ , శరద్ శర్మ , నజ్నీన్ ( Amandeep Singh Gill, Sharad Sharma, Najneen )రజనీలకు స్థానం దక్కింది.ఈ నియామకానికి ముందు గిల్.జెనీవాలోని గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఇంటర్నేషనల్ డిజిటల్ హెల్త్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కోలాబరేటివ్ (I-DAIR) ప్రాజెక్ట్‌కి సీఈవోగా వున్నారు.
గతంలో డిజిటల్ కో ఆపరేషన్‌పై ఐక్యరాజ్యసమితి సెక్రటరీకి హై లెవల్ ప్యానెల్ (2018-2019)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కో లీడ్‌గా వ్యవహరించారు.జెనీవాలో (2016-2018) జరిగిన నిరాయుధీకరణ సదస్సుకు గిల్ భారత రాయబారిగా, శాశ్వత ప్రతినిధిగా సేవలందించారు.
ఇక .రజనీ ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ పొందారు.ప్రీమియర్ సమావేశాలలో 40 పబ్లికేషన్‌లను కలిగి ఉన్నారు.అలాగే శరద్ శర్మ.CISCOలో భాగమైన వైర్‌లెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ అయిన టెల్టియర్ టెక్నాలజీస్‌కు శర్మ సహ వ్యవస్థాపకుడు.







