ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని జీళ్ల చెర్వులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేసింది.ఈ సభకు హాజరైన గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని కొందరు అవహేళన చేశారని కేసీఆర్ అన్నారు.అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు.
పాలేరు ప్రజలకు ఉపేందర్ రెడ్డి ఉండటం అదృష్టమని తెలిపారు.అవకాశాల కోసం పార్టీలు మారే వారిని నమ్మొద్దని సూచించారు.
ఎన్నికల్లో నీతి, నిజాయితీకి పట్టం కట్టాలన్న కేసీఆర్ డబ్బుల కట్టలతో వచ్చే వాళ్లను, పూటకో పార్టీ మారే వాళ్లను నమ్మొద్దని తెలిపారు.సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలో కరువు ఉండదని చెప్పారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు.పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఉండదని వెల్లడించారు.







