నిర్లక్ష్యంగా వ్యాన్ నడిపి .. సైక్లిస్ట్‌‌ను ఢీకొట్టి, భారత సంతతి వృద్ధుడికి సింగపూర్‌లో జైలు శిక్ష

2021లో జరిగిన ప్రమాదంలో సైక్లిస్ట్‌ను ఢీకొట్టినందుకు గాను సింగపూర్‌( Singapore )లో భారత సంతతికి చెందిన వృద్ధ వ్యాన్ డ్రైవర్‌కు 12 వారాల జైలు శిక్షతో పాటు 3,800 సింగపూర్ డాలర్ల జరిమానాను విధించింది న్యాయస్థానం.నిందితుడిని భగవాన్ తులసీదాస్ బిన్వానీ( Bhagwan Tulsidas Binwani ) (70)గా గుర్తించారు.

 70 Years Old Indian-origin Driver Jailed In Singapore For Fatally-hitting Cycli-TeluguStop.com

జైలు నుంచి విడుదలైన తర్వాత 8 ఏళ్ల పాటు అన్ని తరగతుల డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి వుండకుండా ఆయనపై కోర్టు నిషేధం విధించినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.బిన్వానీకి 65 ఏళ్లు నిండటంతో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు కాదు.

ఈ క్రమంలో అతను 54 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడు ఖాన్ సురూజ్‌ను ఢీకొట్టే వరకు మూడేళ్ల పాటు డ్రైవింగ్ చేస్తూనే వున్నాడు.సురూజ్ మరణానికి కారణమైనట్లుగా భగవాన్ నేరాన్ని అంగీకరించాడు.

చెల్లుబాటు కానీ లైసెన్స్ , ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి మరో రెండు ఆరోపణలను కూడా ఆయన అంగీకరించాడు.టెక్స్‌టైల్ హోల్‌సేల్ వ్యాపారం పేరుతో బిన్వానీస్ ఎంటర్‌ప్రైజెస్‌ను నిర్వహిస్తున్న బిన్వానీ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయిన వ్యాన్‌ను నిందితుడు నడిపినట్లు ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Telugu Bhagwantulsidas, Cyclist, Indian, Indian Origin, Jailed, License, Singapo

డిసెంబర్ 27, 2021న సాయంత్రం 5 గంటల సమయంలో బిన్వానీ జురాంగ్ పోర్ట్ రోడ్డు వెంబడి వ్యాన్‌ను నడుపుతూ వస్తున్నాడు.జీబ్రా క్రాసింగ్ వచ్చినా వేగాన్ని తగ్గించకపోగా.సైకిల్‌పై వెళ్తున్న సూరూజ్‌ను ఢీకొట్టాడు.ఈ ఘటనలో అతను సైకిల్‌ పై నుంచి ఎగిరి కొద్దిదూరంలో పడ్డాడు.సూరూజ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.తీవ్రగాయాలతో ఆయన ఆ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయాడు.

బిన్వానీ 65వ పుట్టినరోజుకు 10 వారాల ముందు సింగపూర్ ట్రాఫిక్ పోలీసులు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ధ్రవీకరించడానికి తప్పనిసరి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.దీనికి సంబంధించి అతని చిరునామాకు లేఖను పంపినట్లు కోర్టు పత్రాలు వెల్లడించాయి.

Telugu Bhagwantulsidas, Cyclist, Indian, Indian Origin, Jailed, License, Singapo

దీంతో టెస్టులు చేయించుకున్న బిన్వానీ పూర్తి సమాచారం మాత్రం పోలీసులకు సమర్పించలేదు.ఇది అసంపూర్తిగా వుందంటూ పోలీసులు బిన్వానీకి మెయిల్ పంపారు.అయినప్పటికీ అతని నుంచి స్పందన లేకపోవడంతో బిన్వానీ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లదని ఈసారి పోస్ట్‌లో సమాచారం పంపారు. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దని, మూడేళ్లలోపు అతని లైసెన్స్ చెల్లుబాటు కాకపోవడంతో అతను మరో లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుని, సామర్ధ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని లేఖలో కోరారు.

డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవిత్రా రామ్‌కుమార్( Pavitra Ramkumar ) వాదిస్తూ.బిన్వానీ నేరాన్నీ అంగీకరించడం వెనుక నిజమైన పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు.ఈ సంఘటనకు మృతుడు సూరూజ్‌ను బాధ్యుడిగా చేసేలా అతని ప్రవర్తన వుందన్నారు.చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు భారీ జరిమానాతో పాటు సైక్లిస్ట్ మరణానికి కారణమైనందుకు ఆరు నెలల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube