వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తమ పార్టీ అధినేత చంద్రబాబును అంతం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో కుట్ర అమలుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందనే సమాచారం తమకు ఉందని యనమల తెలిపారు.చంద్రబాబు హెల్త్ రిపోర్టుల అంశంలో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి ఉందన్నారు.
హెల్త్ రిపోర్టులో ఏం రాయాలో సజ్జల చెప్తారా అని ప్రశ్నించారు.ఈనెల 25వ తేదీన తన భద్రతపై చంద్రబాబు లేఖ రాస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
క్రిమినల్ మైండ్ ఉన్న నేతలు వైసీపీ నేతలని విమర్శించారు.చంద్రబాబు లేఖపై ఏసీబీ కోర్టు జడ్జి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.







