యంగ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తదుపరి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
కాగా విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్( Family star ).ఈ మూవీని దర్శకుడు పరశురామ్( Directer Parashuram) తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.గీతా గోవిందం మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరోసారి జతకట్టారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీ గ్లింప్స్‌లో.ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి? అంటూ విజయ్ దేవరకొండ విలన్‌కు వార్నింగ్ ఇస్తాడు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ నెట్టింట వైరల్‌గా మారింది.
ట్విటర్‌లో ఈ డైలాగ్ ట్రెండ్ అవుతోంది.ఈ డైలాగ్‌ను సైతం విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.
విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఆ డైలాగును సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

అలాగే ఈ డైలాగ్‌కు ప్రభాస్ మిర్చి సినిమాలో విలన్‌తో ఫోన్‌లో మాట్లాడే డైలాగ్‌ను జోడించారు.ఇంటర్నెట్ లో అసలు ఏం నడుస్తోంది? అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు.ఇది చూసిన అభిమానులు ఈ ఐరన్ డైలాగ్‌ను జతచేసి పోస్ట్ చేయడంతో ఐరనే వంచాలా ఏంటి ( #Airanevanchalaenti ), ఫ్యామిలీ స్టార్ ( #FamilyStar ) అనే ట్యాగ్ లను ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
ఈ మేరకు నిర్మాణ సంస్థ ఏకంగా పోస్టర్‌నే రిలీజ్ చేసింది.అయితే దీని వెనుక మరో కారణం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ ఐరన్ డైలాగ్, విజువల్స్ యాడ్‌ను తలపించేలా ఉన్నాయంటూ ట్రోల్స్ వాటిని తిప్పికొట్టేందుకు టీమ్ ఇలా ప్లాన్ చేసిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా విడుదల కాకముందే ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతుండడంతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ సినిమా పడ్డట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.







