సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు.దీని కారణంగా జుట్టు రోజురోజుకు పల్చగా మారుతుంది.
ఈ క్రమంలోనే హెయిర్ గ్రోత్ ను పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.కొందరు మందులు కూడా వాడుతుంటారు.
కానీ సహజంగా కూడా హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మ్యాజికల్ సీరం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
వారానికి రెండు సార్లు ఈ సీరంను వాడితే మీ జుట్టు డబుల్ అవుతుంది.మరి ఇంతకీ ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ), వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు, అర కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడికించాలి.దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత వాటర్ జెల్లీ గా మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.నైట్ నిద్రించే ముందు ఈ సీరంను స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని పడుకోవాలి.
నెక్స్ట్ డే మార్నింగ్ మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ సీరం ను వాడితే జుట్టు అద్భుతంగా మరియు వేగంగా ఎదుగుతుంది.
కొద్ది రోజుల్లోనే మీ హెయిర్ డబుల్ అవుతుంది.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.
కురులు ఆరోగ్యంగా మరియు షైనీ గా సైతం మారతాయి.