వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి వేడుక నవంబర్ నెల 1వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం పెళ్లి పనులపై దృష్టి పెట్టారు.
తాజాగా లావణ్య త్రిపాఠితో కలిసి వరుణ్ తేజ్ షాపింగ్ ను పూర్తి చేశారు. లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) పెళ్లి శుభలేఖకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.

శుభలేఖ విషయానికి వస్తే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పేర్లలోని తొలి అక్షరాలను పెళ్లి కార్డ్ పై భాగంలో డిజైన్ చేయడం గమనార్హం.కార్డు లోపల వరుణ్ తేజ్ నాన్నమ్మ తాతయ్యల పేర్లను పెట్టారు.కార్డ్ కింది భాగంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లతో పాటు రామ్ చరణ్( Ram Charan ) పేరును పేర్కొనడం గమనార్హం.ఇటలీలోని టుస్కానీలో నవంబర్ నెల 1వ తేదీన పెళ్లి పనులు జరగనున్నాయని సమాచారం అందుతోంది.

హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఎస్ కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ జరగనుంది.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి గ్రాండ్ గా జరగనుంది.సోషల్ మీడియాలో #varunlav అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.ఐదు వారాల క్రితం నుంచి వెడ్డింగ్ ప్రిపరేషన్స్ మొదలయ్యాయి.పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య అన్యోన్యంగా జీవనం సాగించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ కు( Varun tej ) వరుస షాకులు తగలగా తర్వాత సినిమాలతో వరుణ్ తేజ్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.
వరుణ్ తేజ్ పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.వరుణ్ తేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.
కెరీర్ విషయంలో వరుణ్ తేజ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







