2023-24 మరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కార్యాచరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా:ఖరీఫ్ 2023-24 సీజన్ లో వరి ధాన్యం కొనుగులు కు సంబందించిన కార్యాచరణ ప్రణాళిక పై అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఖరీఫ్ 2023-24 సీజన్ లో కొనుగోళ్ళు సజావుగా జరుగుటకు కేంద్రాల నిర్వాహకులకు, రైస్ మిల్లుల యజమానులకు, సంబందిత అధికారులకు సూచనలు చేశారు.

 2023-24 And Activity Regarding Purchase Of Grain-TeluguStop.com

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ ఖరీఫ్ 2023-24 సీజన్లో లో 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ను కొనుగోలు చేయనున్నామని , ఇందుకై జిల్లాలో 258 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని (ఐ.కె.పి-45 , పి.ఎ.సి.ఎస్-200, డి.సి.ఎం.ఎస్-09, మెప్మ-04) తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో కనీస మౌలిక వసతులయిన త్రాగు నీరు, విద్యుతు, రైతులు కూర్చోవడానికి కుర్చీలు, పందిళ్ళు(టెంట్లు ) వేయించి ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే ప్రభుత్వాదేశానుసారం ఫ్యాక్ ప్రమాణాల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రతి కొనుగోలు కేంద్రములో తార్పలిన్స్, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్ యంత్రముతప్పకుండ సమకూర్చుకోవాలని తెలిపారు.

సీరియల్ నెంబర్ పాటించాలి.రోజువారీ రిజిస్టర్ మరియు ఎకౌంటు రాయాలని అలాట్మెంట్ ఇచ్చిన రైస్ మిల్లులకు మాత్రమే అలాట్మెంట్ కీ లోబడి మాత్రమే ధాన్యం రవాణా చేయాలని,రోజు వారి కొనుగోలు రిపోర్ట్, మిల్లు వారిగా రవాణా రిపోర్ట్ సంబందిత అధికారులకు పంపించాలని తెలిపారు.

ప్రతి కొనుగోలు కేంద్రం లో సరిపడు వాహనాలను అందుబాటులో ఉంచుటకు ధాన్యం రవాణా కాంట్రాక్టర్ ని ఆదేశించినారు. రైస్ మిల్లర్లు( Rice millers ) వచ్చినధాన్యంను త్వరగా దింపుకొని, త్వరగా మిల్లింగ్ చేసి ఇవ్వాలిమరియు హమాలి కొరత లేకుండా చూసుకోవాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు.

ఇట్టి కార్యక్రమం లో, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్.జితేందర్ రెడ్డి, జిల్లా మేనేజర్, జితేంద్ర ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, జిల్లా రవాణా అధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి , జిల్లా వ్యవసాయ అధికారి , జిల్లా లోని మండల తహసీల్దార్ లు , పి.డిమెప్మ , మేనేజర్ డి.సి.ఎం.ఎస్., రైస్ మిల్లర్ల ప్రతినిధులు ,డిప్యూటీ తహసిల్దార్ (పౌ.స) సిరిసిల్ల, వేములవాడ, సంబందిత అధికారులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube