Rathika Rose : రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లి వచ్చాక ఏం జరుగుతోంది?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచెస్ తరువాత ఎక్కువగా యువత మాట్లాడుకుంటున్నది ఒక్క బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) గురించే.అవును, గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 7 రేటింగ్ విషయంలో గట్టిగా దూసుకుపోతోంది.

 Rathika Rose Behaviour After Wild Card Entry-TeluguStop.com

ఇక రతిక రోజ్( Rathika rose ) గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.ఆమె బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన మొదటి వారంలో పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) తో నడిపిన లవ్ ట్రాక్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.

అయితే అనూహ్యంగా రెండో వారంలోనే సీన్ కాస్త రివర్స్ అయింది.పవర్ అస్త్ర టాస్క్ లో ప్రశాంత్ ని నోటికొచ్చినట్టు మాట్లాడి అతగాడికి పాపం షాక్ ఇచ్చింది.

Telugu Big Boss, Nagarjuna, Rathika Rose, Shivaji, Tollywood-Movie

అయితే ఆ తరువాత పరిణామాలు ఆమెకి గుణపాఠాన్ని నేర్పాయి… అది వేరే విషయం.రతిక ఆ ఘటన తరువాత సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకుంది.ఇంకేముంది, కట్ చేస్తే నాలుగో వారంలో రతిక రోజ్ ఎలిమినేట్ అయింది.అయితే ఉల్టా పుల్టా ట్విస్ట్ అంటూ రతికను మళ్ళీ హౌస్ లోకి తీసుకు వచ్చారు బిగ్ బాస్.

ఇప్పుడు జనాలు షాక్ అయ్యారు.అయితే ఈ సారి అమ్మడు ఫుల్ స్ట్రాటజీ తో వచ్చినట్లు కనబడుతోంది.

రావడం తోనే శివాజీ ని హగ్ చేసుకుంది.అన్న క్షమించు అంటూ తెగ డ్రామా చేసింది.

శివాజీ కాళ్ళు మొక్కి మరీ క్షమాపణ కోరింది.నేను ఎలిమినేట్ అయిన షాక్ లో ఉన్నాను.

అందుకే ఆ రోజు అలా మాట్లాడకుండా వెళ్ళిపోయాను అంటూ వివరణ ఇచ్చింది.దాంతో శివాజీ పర్సనల్ ఇగోలు ఏమీ లేవు అదంతా గేమ్ లో మాత్రమే అంటూ శివాజీ చెప్పి అమ్మడుని కూల్ చేశాడు.

ఇక హౌస్ ఉన్న అందరితో మాట్లాడిన రతిక ప్రశాంత్ ని మాత్రం చూసీచూడనట్లు వెళ్లిపోవడం కొసమెరుపు.ఇక చేసేదేమిలేక ప్రశాంత్ ఆమె దగ్గరికి వెళ్లి రసగుల్లా తినిపించి వెల్కమ్ చెప్పాడు.

Telugu Big Boss, Nagarjuna, Rathika Rose, Shivaji, Tollywood-Movie

ఇక ఆమె నడతని చూసిన జనాలు మాత్రం అవాక్కవుతున్న పరిస్థితి.బాగా క్రేజ్ ఉన్న శివాజీ( Shivaji ) టీమ్ లో చేరిపోయింది మెల్లగా.అన్నా అన్నా అంటూ శివాజీ దగ్గర మార్కులు కొట్టేస్తోంది.దాంతో ఆమె ప్రవర్తన చూసి నెటిజన్లు రతిక ( Rathika rose )రూట్ మార్చింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఆమె ఇలాగే కంటిన్యూ చేస్తే టాప్ ఫైవ్ లో వుండడం ఖాయం అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube