చంద్రబాబు కేసులపై ఉన్నతస్థాయి విచారణకు సిద్ధమా?: మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.ఆధారాలు ఉండటంతోనే అధికారులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

 Are You Ready For A High-level Inquiry Into Chandrababu's Cases?: Minister Ambat-TeluguStop.com

గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు నమ్మలేదని మంత్రి అంబటి తెలిపారు.నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఉన్నతస్థాయి విచారణకు సిద్దంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని సైతం చంద్రబాబు ప్రజల కోసం పక్కన పెట్టారంటున్నారు.మరీ ఏ అర్హత ఉందని లోకేశ్ ను మంత్రిగా చేసి మూడు శాఖలను అప్పగించారని నిలదీశారు.

ఇది కుటుంబ స్వార్థం కాదా అని ప్రశ్నించారు.నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube