డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ శ్రీ లీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ఆది కేశవ( Aadikeshava ) .సినిమాని సూర్యదేవర నాగ వంశీ సాయి సౌజన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇక ఈ సినిమా నవంబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి లీలమ్మో ( Leelammo ) అనే పాటను విడుదల చేశారు.ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

ప్రకాష్ కుమార్ స్వరాల అందించిన ఈ సాంగ్ కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.నకాష్ అజీజ్, ఇంద్రావతి చౌహన్ పాటను ఆలపించారు.ఇక ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
ఇక ఈ పాట గురించి నటి శ్రీ లీల మాట్లాడుతూ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు ఇప్పుడే దసరా అమ్మవారి పండుగ పూర్తి అయింది.మరి కొద్ది రోజులలో శివుడి పండుగ మొదలు కాబోతుంది అంటూ ఈ సినిమా విడుదల తేదీ గురించి ఈమె వెల్లడించారు.
ఇక లీలమ్మో అనే పాట గురించి కూడా శ్రీ లీల( Sreeleela ) మాట్లాడుతూ మొట్టమొదటిసారి నా పేరు మీద ఒక పాట రావడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.

ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను చూస్తూ ఎంజాయ్ చేస్తారని ముఖ్యంగా వైష్ణవ్(Vaishnav Tej) చాలా అద్భుతంగా డాన్స్ చేశారని చెప్పుకొచ్చారు.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ( Sekhar Master ) చాలా బాగుంది.అసలు సిసలు మాస్ పాట అంటూ శ్రీలీల చెప్పుకొచ్చింది.
ఇది వినగానే నాకు నాగిని డాన్స్ చేయాలనిపించిందని.ఆ రేంజ్ లో ఈ పాట ఉంటుంది అంటూ శ్రీ లీల ఈ పాట గురించి కామెంట్ చేయడంతో ఈ పాటపై మరిన్ని అంచనాలు కూడా పెరిగిపోయాయి.
భగవంత్ కేసరి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె త్వరలోనే ఆదికేశవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.







