సోషల్ వర్కర్ హమారా ప్రసాద్( Hamara prasad ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జై భీమ్ సినిమా( Jai Bhim )లో సూర్యకు రావాల్సిన అవార్డ్ పుష్ప సినిమా( Pushpa )లో బన్నీకి వచ్చిందని అంటున్నారని తెలిపారు.
సినిమా పరంగా జై భీమ్ అవేర్ నెస్ సినిమా అని అయితే అవార్డ్ ఇచ్చే వ్యక్తి పుష్పకు ఇచ్చాడని అయితే ఏమైందని హమారా ప్రసాద్ ప్రశ్నించారు.ఒక వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగులకు సైతం రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారని ఆయన తెలిపారు.
వివక్ష అనేది ఎవరూ ఎవరిపై చూపించరని ఆయన తెలిపారు.హోటల్ లో కూర్చుని తిన్న సమయంలో మన పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో ఏ కులమో మనకు తెలుస్తుందా అని హమారా ప్రసాద్ పేర్కొన్నారు.దళిత సామాజికవర్గానికి అన్యాయం జరిగితే ఫైట్ చేయడానికి పెద్దపెద్ద స్వామీజీలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.బ్రిటిష్ వాళ్లు క్రిస్టియన్స్ కాబట్టి దేశంలో క్రిస్టియన్స్ ను తీసేయడం న్యాయమా అని ఆయన అన్నారు.
గతాన్ని పట్టుకుని మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు.నాకు భవిష్యత్తు కార్యాచరణ ఏమీ లేదని హమారా ప్రసాద్ ( Hamara prasad )పేర్కొన్నారు.నేను అంబేద్కర్ ను మూడు కోణాల్లో చూస్తానని ఆయన వెల్లడించారు.ఒక విషయంలో హీరో, ఒక విషయంలో జీరో, ఒక విషయంలో విలన్ అని తాను అన్న కోణాలను ఆలోచించాలని హమారా ప్రసాద్ చెప్పుకొచ్చారు.రాజ్యాంగం అమలు పరచడంలో తప్పులు చేస్తే ఏం చేయాలని ఆయన తెలిపారు.1920లో మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టారని హమారా ప్రసాద్ వెల్లడించారు.హమారా ప్రసాద్( Hamara prasad ) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.సోషల్ వర్కర్ హమరా ప్రసాద్ కు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.