సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది వాళ్ళకంటూ ఒక స్టార్ స్టేటస్ ని అనుభవించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు.ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ కావడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది సామాన్య వ్యక్తులకు ఎవరికీ తెలియదు.
కానీ ఆ సినిమా కష్టాన్ని రిలాక్స్ అవ్వడానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజులు టూర్లకు వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటారు.ఇక ఎక్కువ మంది హీరోలు సినిమా సినిమాకి మధ్య బ్రేక్ దొరికితే టూర్లకి వెళ్తుంటారు.
నిజానికి మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి హీరో అయితే వరుసగా తన ఫ్యామిలీతో ఫ్యామిలీ ట్రిప్( family trip ) టూర్లకు వెళుతూ ఉంటాడు.అందులో భాగంగానే ఆయన ఒక సినిమాకి ముందు రెండు మూడు ట్రిప్ లకి వెళుతూ ఉంటాడు అనే టాకైతే ఉంది.ఇక సర్కార్ వారి పాట( Sarkaru Vaari Paata ) సినిమా సమయంలో అయితే సినిమా స్టార్ట్ అవ్వక ముందు రెండు సార్లు స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక రెండు సార్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత మరో రెండు సార్లు టూర్లకి వెళ్లినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.ఇక దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు ఎక్కడికి వెళ్లినా కూడా తన సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ అనేవి తన అభిమానులకి ఇస్తూ ఉంటారు.
దీని ద్వారా ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఆయన అభిమానులకు ఈజీగా తెలుస్తుంది.అందుకే మహేష్ బాబు రిలాక్సేషన్ కోసం తన ఫ్యామిలీతో ట్రిప్ తనకి అన్ని విధాలుగా సౌకర్యం గా ఉంటుందంట.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో గుంటూరు కారం( Guntur Kaaram ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సక్సెస్ అయితే మహేష్ బాబుకి త్రివిక్రమ్ ఒక మంచి అదిరిపోయే హిట్ ఇచ్చినట్టు అవుతుంది.
కాబట్టి ఈ సినిమా మీదనే అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు ఇద్దరు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…
.