జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ ను ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ పరిశీలించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కేంద్ర బృందం హైదరాబాద్ లోని జలసౌధలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు.
మేడిగడ్డ బ్యారేజ్ లోని పిల్లర్ కుంగుబాటుపై ఇరిగేషన్ మరియు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష చేస్తున్నారు.ఈ సమావేశంలో భాగంగా సాంకేతిక వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకోనుంది.
భేటీ అనంతరం నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.కాగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్రం అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్యారేజ్ ను పరిశీలించిన కమిటీ కేంద్రానికి నివేదికను అందించనుంది.







