నందమూరి నటసింహ బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు .ఇక ఈ ఏడాది బాలకృష్ణ ఏకంగా రెండు హిట్ సినిమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ ఏడాది మొదట్లో వీర సింహారెడ్డి సినిమా( Veerasimha Reddy ) ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన బాలకృష్ణ తాజాగా దసరా పండుగ సందర్భంగా భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదలయ్యే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇకపోతే తాజాగా బాలయ్య కు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.బాలయ్యకు మూడు కోరికలు ఉన్నాయని ఆ మూడు కోరికలను వచ్చే ఏడాది ఎలాగైనా తీర్చుకోవాలి అని తపన పడుతున్నారని తెలుస్తోంది.మరి వచ్చే ఏడాది బాలయ్య పూర్తి చేయబోయే ఆ మూడు కోరికలు ఏంటి అనే విషయాన్ని వస్తే… బాలకృష్ణ వచ్చే ఏడాది తన కుమారుడు మోక్షజ్ఞ (Mokshagna) ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నారట.
ఇదే విషయాన్ని పలుసార్లు పలు సందర్భాలలో తెలియజేశారు.ఇలా వచ్చే ఎడాది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పక్క ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక బాలయ్య మరో కోరిక ఏంటి అనే విషయానికి వస్తే బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్( Aditya 369 Sequel ) చిత్రాన్ని చేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్నారు.అయితే ఆ కోరికను కూడా వచ్చే ఏడాది పూర్తి చేసుకోవాలని ఈయన ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఇక బాలయ్య మూడో కోరిక గురించి మాట్లాడాల్సి వస్తే బాలకృష్ణ ఎప్పటినుంచో ఒక సినిమాకైనా దర్శకుడుగా( Director ) పని చేయాలని కోరుకుంటున్నారట.భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో భాగంగా తాను ఒక కథను సిద్ధం చేసుకున్నానని త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అంటూ కూడా వెల్లడించారు.
బహుశా ఈ సినిమాకు బాలకృష్ణ దర్శకుడుగా పని చేయబోతున్నారని తెలుస్తోంది.బాలయ్య పూర్తి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారట మరి ఈ మూడు కోరికలను ఈయన తీర్చుకోగలరా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.







