సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి సంచలన సవాల్..!!

నవంబర్ నెలలోనే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికలలో గెలవాలని ఎవరికివారు తమ వ్యూహాలతో ప్రజల మధ్యకు వెళ్తున్నారు.

 Revanth Reddy Sensational Challenge To Cm Kcr Telangana Elections, Revanth Reddy-TeluguStop.com

ఇదే సమయంలో ప్రజలకు హామీలు ఇస్తూనే మరోపక్క ప్రత్యర్థులకు సవాళ్లు కూడా విసురుతున్నారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్( BRS party).

అదేవిధంగా కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నట్లు పలు సర్వేలలో ఫలితాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy )సీఎం కేసీఆర్ కి సంచలన సవాల్ విసిరారు.విషయంలోకి వెళ్తే జరగబోయే ఎన్నికలలో కేసీఆర్( CM KCR ) కి దమ్ముంటే కొడంగల్ లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.ఈ క్రమంలో ఇద్దరం నామినేషన్ వేద్దాం తేల్చుకుందామని అన్నారు.

రాజకీయాల్లో ఉండాలో వదిలేసి వెళ్లాలో డిసైడ్ అవుదాం.గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు.

మంగళవారం కొడంగల్ లో కార్యకర్తల ఉద్దేశించి రేవంత్ మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన, దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చిన, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన.

వచ్చి కొడంగల్ లో నామినేషన్ వేసి నాపై పోటీ చేయాలని కేసీఆర్ కి సవాల్ విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube