బైక్ తో గేదెను ఢీ కొట్టడంతో బాలుడిని చితకబాది దారుణ హత్య..!

ఓ పదహారేళ్ల యువకుడు బైక్ పై వెళుతూ ఓ గేదకు ఢీకొట్టాడు.దీంతో ఆ బాలుడిని విచక్షణారహితంగా చితకబాది హతమార్చిన ఘటన ఝార్ఖండ్ లోని( Jharkhand ) దుమ్కా జిల్లా సంతాలి లోని కుర్మహత్ లో చోటు చేసుకుంది.

 Jharkhand Boy Killed For Hitting A Buffalo With Bike Details, Jharkhand, Boy, Ki-TeluguStop.com

తమకు న్యాయం చేయాలంటూ మృతి చెందిన బాలుడి బంధువులంతా రహదారిపై ధర్నాకు దిగడంతో పోలీసులు ఆందోళనను విరమింప చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.కుర్మహత్ గ్రామానికి చెందిన ఓ పదహారేళ్ల యువకుడు ఆదివారం సాయంత్రం ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు బయటకు వెళ్లి, ఆ తరువాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి బైక్ పై( Bike ) ఇంటికి వస్తున్న క్రమంలో తాథీ గ్రామంలో అనుకోకుండా గేదె గుంపులోని గేదెకు ఢీకొట్టాడు.

Telugu Boy, Atrocity, Bike, Buffalo, Jharkhand, Kurmahat-Latest News - Telugu

దీంతో బైక్ తో ఢీ కొట్టిన యువకులకు.గేదెల వెంట వచ్చిన కొంతమంది వ్యక్తులకు మధ్య గొడవ జరిగింది.ఆ బాలుడు గేదె( Buffalo ) యజమానికి నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పినా కూడా ఆ వ్యక్తులు వినిపించుకోకుండా బాలుడిని విచక్షణారహితంగా కొట్టారు.ఆ బాలుడి తోపాటు ఉండే స్నేహితులు అక్కడనుండి పారిపోయారు.

చితకబాదిన బాలుడికి తీవ్ర గాయాలు అవడంతో ఆ గ్రామానికి చెందిన స్థానికులు సరైయత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు.చికిత్స పొందుతూ ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు.

Telugu Boy, Atrocity, Bike, Buffalo, Jharkhand, Kurmahat-Latest News - Telugu

బాలుడు అనుకోకుండా చేసిన పొరపాటుకు ఇలా బాలుడిని చితకబాది చావుకు కారణం అవడంతో మృతుడి తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గ్రామ సమీపంలోని రహదారిని నిర్బంధించారు.నిందితులను అరెస్టు చేసేంతవరకు ధర్నా( Protest ) చేస్తామని తెలపడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులను నచ్చజెప్పారు.కచ్చితంగా రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేసి శిక్ష పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube